టార్గెట్‌ ఎవరెస్ట్‌ | Girl on mega marathon for Swachh Telangana | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ఎవరెస్ట్‌

Published Tue, May 30 2017 1:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

టార్గెట్‌ ఎవరెస్ట్‌

టార్గెట్‌ ఎవరెస్ట్‌

మారధాన్‌తో 31 జిల్లాల్లో పర్యటన
అభినందించిన పలు రాజకీయ నాయకులు
 
పటాన్‌చెరు : ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించడమే తన లక్ష్యమని సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ ప్రాంతానికి చెందిన కోర నిఖితాయాదవ్‌ తెలిపింది. అసాధ్యమైన లక్ష్యాలు సుసాధ్యం చేసి బాలికల్లో రోల్‌ మోడల్‌గా నిలవాలని ఈ సాహసం చేపట్టినట్టు చెప్పింది . తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి బాలికల్లో ఆత్మస్తెర్యం నిపేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. ఇప్పటికి 29 జిల్లాల్లో పర్యటన ముగించుకుని మంగళవారం  30 వ జిల్లా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చేరుకుంది. దీంతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి దండు విక్రమ్‌ యాదవ్, ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి చక్రీ, నిరంజన్‌లు నిఖితా యాదవ్‌ను కలసి సన్మానం చేసి తన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం నిఖితా యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ప్రధమ సంవత్సరం పూర్తి చేశానని, కుటుంబ పెద్దలు యాదవ సంఘాల సహకారంతో ఆడపిల్లల్లో ఆత్మస్ధెర్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తానని తెలిపింది. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పింది.
 
ప్రస్తుతం మారధాన్‌తో 31 జిల్లాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టూకున్నానని, ఏప్రిల్‌ 27న ప్రారంభమైన మారధాన్‌తో ఇప్పటి వరకు 30 జిల్లాలో పర్యటనలో 1990 కిలోమీటర్ల పూర్తి చేసుకున్నాని వివరించింది. జూన్‌ 2 నాటికి హైదరాబాద్‌కు చేరుకొని అక్కడ నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటానని నికిత తెలిపింది. కాగ చిన్న వయస్సులోనే ఉన్నత లక్షాఅ్యలు నిర్దేశించుకని ఆ దిశగా పయనిస్తున్న నిఖితను వైఎస్సార్‌సీపీ నాయకులు అభినందించారు. నిఖిత యాదవ్‌కు స్వాగతం పలికిన యాదవ సంఘం నాయకులు ఆర్‌. కుమార్‌ యాదవ్, ఆర్‌.సంతోష్‌ యాదవ్, దండు విక్రమ్‌ యాదవ్‌లను కృతజ్ఞతలు తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement