ఎవరెస్ట్ పైకి.. ఎనిమిదో సారి
నేపాల్ మహిళ సరికొత్త రికార్డు
కట్మాండు:
నేపాల్‌కు చెందిన 44 ఏళ్ల మహిళ మౌంట్ ఎవరెస్ట్‌ను 8వ సారి ఎక్కి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆ పర్వతాన్ని అధిక సార్లు ఎక్కిన మహిళగా నిలిచారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన లాక్పా షెర్పా...శనివారం ఉదయం మౌంట్ ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించా రని నిర్వాహకులు తెలిపారు.
ఏప్రిల్ నెల మధ్యలో టిబెట్ వైపు నుంచి ప్రయాణం సాగించిన లాక్పా, సహచరిణి నీమా డోర్జీ షెర్పాతో కలిసి విజయవంతంగా యాత్రను పూర్తిచేశారు. ఇంతటితో ఆగనని ఎవరెస్ట్‌ను పదిసార్లు ఎక్కడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. ఎలాంటి శిక్షణ లేకుండానే లాక్పా 2000లో తొలిసారి మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు.