
వరుణ్ తేజ్
ప్రేమికుడు వ్యోమగామి (ఆస్ట్రోనాట్)గా మారబోతున్నాడు. ప్రేమ కోసం అమ్మాయి చుట్టూ తిరిగినవాడు ఒక ఆపరేషన్ నిమిత్తం అంతరిక్షంలో తిరగనున్నాడు. ఏం చెబుతున్నామో అర్థం కావడంలేదా? ‘తొలిప్రేమ’ సినిమాలో ప్రేమికుడిగా కనిపించి, మంచి హిట్‌ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ తన నెక్ట్స్ సినిమాలో వ్యోమగామిగా కనిపిస్తారట. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస్ ఫిల్మ్‌లో వరుణ్ నటించనున్న విషయం తెలిసిందే.
దాని కోసం ప్రిపరేషన్స్ కూడా మొదలుపెట్టేశారట. ఈ సినిమా గురించి నిర్మాత వై. రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఘాజీ’ తర్వాత సంకల్ప్ రెడ్డి మరో ఎగై్జటింగ్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. రెగ్యులర్ సినిమాల టైమ్ అయిపోయే తరుణం వచ్చింది. ఇప్పుడు కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలు ఆడే రోజులు వచ్చాయి. మా బ్యానర్ ద్వారా కంటెంట్ ఉన్న కథలను అందించాలన్నది మా ఆశయం. వరుణ్ తేజ్ ఈ సినిమా ఒప్పుకుంటారో.. ఒప్పుకోరో అని ఒక చిన్న టెన్షన్ ఉండేది.
కానీ తను కూడా మాలాగే ఎగై్జట్ అయి, సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. అది మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమా మొత్తం స్పేస్‌లో జరగనున్నందు వల్ల దర్శకుడు సంకల్ప్, హీరో వరుణ్ తేజ్ ఒక నెల పాటు ఖజికిస్థాన్‌లో జీరో గ్రావిటీ కండీషన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటారు. సినిమాలో మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి కూడా ఇలానే ట్రైన్ చేయనున్నాం’’ అన్నారు. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను ముందుగా యూఎస్‌లో షూట్ చేద్దామనుకున్నారట. కానీ ఇప్పుడు జార్జియాలో షూట్ చేయాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment