
ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. వరున్ ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వ్యోమగామి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నటించేందుకు వరుణ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment