వాషింగటన్: చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన ప్రముఖ ఆస్ట్రోనాట్ ఎడ్గర్ మిఛెల్ (85) ఇక లేరు. 1971లో అపొలో-14 మిషన్ ద్వారా చందమామపై నడిచిన వ్యోమగామి ఎడ్గర్ మిచెల్ కన్నుమూశారు. అమెరికాకు చెందిన ఈ వ్యోమగామి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని హాస్పిటల్లో ఫిబ్రవరి 5న మిఛెల్ మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా 1930 సెస్టెంబర్17న టెక్సాస్లోని హెరెఫోర్డ్ లోపుట్టిన ఆయన జన్మించారు. చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తిగా ఎడ్గర్ మిచెల్ రికార్డు క్రియేట్ చేశారు. 1971లో అమెరికా ప్రయోగించిన అపొలో-14 మిషన్‌లో పాల్గొన్న 12 మంది వ్యోమగాముల్లో ఎడ్గర్ మిచెల్ సభ్యుడు. సుమారు తొమ్మిది గంటల పాటు చంద్రుడిపై నడిచి రికార్డు సృష్టించారు. రోదసీ ప్రయాణం తర్వాత తనకు దైవత్వం ఆవహించినట్లు ఆస్ట్రోనాట్ ఎడ్గర్ తెలిపారు. 1972లో నాసా నుంచి రిటైర్ అయిన తర్వాత నియోటిక్ సైన్స్ ఒక ఫౌండేషన్ ను స్తాపించారు. మానవ మస్తిష్కంపై అధ్యయనం కొనసాగించారు. అనంతరం ఆయన అంతరిక్షయాన అనుభవాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. భూమిపైకి గ్రహాంతరవాసులు అడుగు పెట్టినట్లు ఎడ్గర కొన్ని సందర్భాల్లో తెలిపారు. దీనిపై నాసా శాస్త్రజ్ఞులు సంతాపం వ్యక్తం చేశారు. 45 వ వార్షికోత్సవం సందర్భంగా మరో వ్యోమగామిని కోల్పోవడం విచారకరమన్నారు.
ఆ వ్యోమగామి ఇక లేరు
Published Sat, Feb 6 2016 1:54 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement
Advertisement