
సాక్షి, హైదరాబాద్: ఏపీలోనే అంపశయ్య మీద ఉన్న టీడీపీ.. తెలంగాణలో పూర్వవైభం కోసం ప్రయత్నించడం నిజంగా విడ్డూరమే. అయితే ఈ ప్రయత్నంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణిని మరోసారి బయటపెట్టాయి.
తాజాగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం ప్రారంభించాడాయన. టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో పార్టీని హైలెట్ చేయాలనే తాపత్రయంలో ఆయన చేసిన కామెంట్లపై తెలంగాణ సమాజం మండిపడుతోంది.
‘‘తెలంగాణ వాళ్లకు బియ్యం అన్నం తినడం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే..’’.. నలభై ఏళ్ల కిందటే ఆహార భద్రతను తాము అమలు చేసి చూపినట్లు గప్పాలు కొట్టుకున్న బాబు.. అప్పటిదాకా తెలంగాణలో రాగులు, సజ్జలు, జొన్నటలు తింటూ బతుకుతున్న వారికి.. బియ్యంతో అన్నం వండుకుని తినడం పరిచయం చేశామన్న ధోరణిలో మాట్లాడారాయన.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు అప్పటిదాకా తెలంగాణ ప్రజలు అన్నం ముఖమే ఎరుగరన్న రీతిలో మాట్లాడారాయన. సీనియర్ రాజకీయ నేత అజ్ఞాన అహంకార వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి తెలంగాణలో.
Comments
Please login to add a commentAdd a comment