అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండవ దశ భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.
భారత్ బ్రాండ్ కింద కేజీ గోధుమ పిండి ధర రూ. 30 కాగా.. బియ్యం రూ. 34వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో గోధుమ పిండిని రూ. 27.5కు, బియ్యాన్ని రూ. 29కే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ ధరలు కొంత పెరిగాయి. అయితే ప్రభుత్వం లక్ష్యం వ్యాపారం కాదని, మార్కెట్ ధరల కంటే తక్కువకు అందించడమే అని, ఫేజ్-2 ప్రారంభించిన సమయంలో కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' తెలిపారు.
గోధుమ పిండి, బియ్యం రెండూ కూడా 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తాయి. తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యాన్ని సరఫరా చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి 3.69 లక్షల టన్నుల గోధుమ, 2.91 లక్షల బియ్యాన్ని సేకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ స్టాక్ ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలు
ప్రజలు కోరుకుంటే గోధుమ పిండి, బియ్యాన్ని మరింత చిన్న ప్యాకెట్ల రూపంలో కూడా అందించడానికి సిద్ధమని ప్రహ్లాద్ జోషి అన్నారు. మునుపటి దశలో కేంద్రం.. 15.20 లక్షల టన్నుల గోధుమ పిండిని, 14.58 లక్షల టన్నుల బియ్యం (అక్టోబర్ 2023 నుంచి జూన్ 30, 2024 వరకు) పంపిణీ చేసినట్లు సమాచారం.
A Step Towards Food Affordability: Bharat Atta & Bharat Rice at Subsidized Rates
Delighted to launch Phase II of 'Bharat Atta' & 'Bharat Rice' sales from Krishi Bhawan, New Delhi today.
This latest initiative by the @narendramodi Govt aims to support consumers by providing… pic.twitter.com/iaQpUfnjjA— Pralhad Joshi (@JoshiPralhad) November 5, 2024
Comments
Please login to add a commentAdd a comment