atta
-
రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్
అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండవ దశ భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.భారత్ బ్రాండ్ కింద కేజీ గోధుమ పిండి ధర రూ. 30 కాగా.. బియ్యం రూ. 34వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో గోధుమ పిండిని రూ. 27.5కు, బియ్యాన్ని రూ. 29కే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ ధరలు కొంత పెరిగాయి. అయితే ప్రభుత్వం లక్ష్యం వ్యాపారం కాదని, మార్కెట్ ధరల కంటే తక్కువకు అందించడమే అని, ఫేజ్-2 ప్రారంభించిన సమయంలో కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' తెలిపారు.గోధుమ పిండి, బియ్యం రెండూ కూడా 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తాయి. తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యాన్ని సరఫరా చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి 3.69 లక్షల టన్నుల గోధుమ, 2.91 లక్షల బియ్యాన్ని సేకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ స్టాక్ ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ కేటాయిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుప్రజలు కోరుకుంటే గోధుమ పిండి, బియ్యాన్ని మరింత చిన్న ప్యాకెట్ల రూపంలో కూడా అందించడానికి సిద్ధమని ప్రహ్లాద్ జోషి అన్నారు. మునుపటి దశలో కేంద్రం.. 15.20 లక్షల టన్నుల గోధుమ పిండిని, 14.58 లక్షల టన్నుల బియ్యం (అక్టోబర్ 2023 నుంచి జూన్ 30, 2024 వరకు) పంపిణీ చేసినట్లు సమాచారం.A Step Towards Food Affordability: Bharat Atta & Bharat Rice at Subsidized RatesDelighted to launch Phase II of 'Bharat Atta' & 'Bharat Rice' sales from Krishi Bhawan, New Delhi today.This latest initiative by the @narendramodi Govt aims to support consumers by providing… pic.twitter.com/iaQpUfnjjA— Pralhad Joshi (@JoshiPralhad) November 5, 2024 -
ఓ అత్త పెత్తనం...
ఆస్తి కోసం పండంటి బిడ్డతో కోడల్ని బయటపెట్టిన అత్త ఇంట్లోకి రానిచ్చేది లేదని మొండిపట్టు వణికించే చలిలో రామాలయంలోనే రాత్రంతా... పోలీసుల జోక్యంతో వివాదం పరిష్కారం కాకినాడ క్రైం : నిండు గర్భిణితో అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లి పండంటి బిడ్డతో తిరిగి వస్తే ఇంట్లోకి అడుగు పెట్టనీయని ఓ అత్త ఉదంతమిదీ. ఇరుగు, పొరుగు కుటుంబాలు సర్ది చెప్పినా ససేమిరా అనడంతో చివరకు పోలీసు స్టేషన్ వరకు విషయం వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే...తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని వేమగిరికి చెందిన వాసంశెట్టి శ్రీలక్ష్మి కాకినాడలోని ఇంద్రపాలెం పల్లపు వీధికి చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి గుత్తుల సత్యనారాయణ కుమారుడు శ్రీనివాసుని రూ.1.80 లక్షలు కట్నంగా ఇచ్చి 2015లో వివాహం చేసుకుంది. ఆ వెంటనే గర్భం దాల్చడంతో పురుడు కోసం గతేడాది పుట్టింటికి వెళ్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆనందంగా నెలల బిడ్డతో అత్తవారింటికి వచ్చిన ఆమెకు అత్త ప్రవర్తన ఆందోళనకు గురిచేసింది. బిడ్డతో వెళ్లేందుకు ఐదు, ఏడు, తొమ్మిది నెలల్లో ముహూర్తాలు పెట్టించినా ఏదో ఒక సాకుతో అత్త మంగ అడ్డంకులు సృష్టించడంతో అమ్మ సుభద్ర సాయంతో నేరుగా బిడ్డతో సహా అత్తింటికి బుధవారం రాత్రి చేరుకుంది. ఇంట్లోకి సంప్రదాయబద్ధంగా ఇంట్లోకి ఆహ్వానించాల్సిందిపోయి ‘రావద్ద’ంటూ అత్త తలుపులేసేయడంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. ఇరుగు పొరుగుతోపాటు ఆ వీధిలో పెద్దలు చెప్పినా ససేమిరా అనడంతో చేసేదేమీ లేక ... చంటిబిడ్డతో వెనక్కి వెళ్లలేక స్థానికంగా ఉన్న రామాలయ ఆవరణలో రాత్రంతా చలిలో ఇబ్బందులుపడ్డారు గురువారం ఉదయం వెళ్లి బతిమలాడినా మధ్యాహ్నం వరకూ మొండిపట్టు వీడలేదు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఇంద్రపాలెం ఎస్సై తిరుపతి రంగప్రవేశం చేసి శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ, రెండో భార్య మంగకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మాట వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించడంతో సమస్య సద్దుమణిగింది. చలిలో ఇబ్బందులు పడ్డాం... నెలల చంటి బిడ్డతో సారె, లాంఛనాలతో అత్తారింటికి వస్తే ఇలా చేయడం చాలా బాధ అనిపించిందని శ్రీలక్ష్మి తల్లి సుభద్ర వాపోయింది. తన అల్లుడు శ్రీనివాస్‌కు మంగ సవతి తల్లి కావడంతో ఇంట్లో ఉండనీయకుండా బయటకు పంపించే ఎత్తుగడ వేస్తోందని ఆమె ఆరోపించారు. ఆమెకు ఓ బిడ్డ ఉన్నాడని, ఈయనని ఇంట్లో పెట్టుకుంటే ఆస్తి ఇబ్బందులు వస్తాయని ఇలా చేస్తోందని సుభద్ర పోలీసులకు తెలిపారు.