గీత స్మరణం | Song of the day from annamayya movie | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Thu, Dec 19 2013 11:54 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

గీత స్మరణం - Sakshi

గీత స్మరణం

బ్రహ్మ కడిగిన పాదము
 బ్రహ్మము తానెనీ పాదము    ॥
 చెలగి వసుధ గొలిచిన నీ పాదము
 బలి తలమోపిన పాదము
 తలపక గగనము తన్నిన పాదము (2)
 బలరిపు గాచిన పాదము
 బ్రహ్మ కడిగిన పాదము
 వరమ యోగులకు పరిపరి విధముల
 వరమొసగెడి నీ పాదము
 తిరువేంకటగిరి తిరమని చూపిన
 పరమపదము నీ పాదము    ॥


 గానం : చిత్ర, సుజాత, అనురాధా శ్రీరాం
 
 పల్లవి :
 
 గోవిందా నిశ్చలానంద మందార మకరంద
 నీ నామం మధురం నీ రూపం మధురం
 నీ సరస శృంగార కీర్తనలు
   మధురాతి మధురం స్వామి ఆహా...
 ఏమొకో... ఏమొకో చిగురుటధరమున
   యెడనెడ కస్తూరి నిండెనో
 భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా    ॥
 
 చరణం : 1
 
 కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన
 చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
 నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొనచూపులు (2)
 నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా
 
 చరణం : 2
 
 జగడపు చనవుల జాజర సఖినల మంచపు జాజర
 జగడపు చనవుల జాజర
 మొల్లలు కురుముల ముడిచిన బరువున
 మొల్లకు సరసపు మురిపెమున
 జల్లన పుప్పొడి జారగ పతిపై జల్లేరతివలు జాజర    ॥
 భారపు కుచముల పైపై కడు
 సింగారము నె ఱపెడి గంధముడి
 చేరువ పతిపై చిందగ పడతులు సారెకు జల్లేరు జాజర
 ॥
 బింకపు కూటమి పెనగెటి చెమటల
 పంకపు పూతల పరిమళము
 వేంకటపతిపై వెలదులు చించేరు
 సంకుమ దమ్ముల జాజర    ॥
 
 నిర్వహణ: నాగేశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement