కాలిపోయిన మామిడి చెట్లను పరిశీలిసుతన్న రెవెన్యూ సిబ్బంది
సంబేపల్లె : మండలంలోని గురిగింజకుంట పంచాయతీ దిన్నెపల్లెకు చెందిన నారాయణరెడ్డి అనే రైతు మామిడి తోట దగ్ధమైంది. నారాయణరెడ్డి సర్వే నంబర్ 448–2లో 5 ఎకరాల్లో మామిడి తోట సాగు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తోటకు నిప్పంటించారు. ఎకరాన్నరలోని 85 మామిడి చెట్లు, 20 టేకు చెట్లు, డ్రిప్ వైరు 30 కట్టలు కాలిపోయాయి. బాధితుడు శుక్రవారం సంబేపల్లె పోలీసులు, రెవెన్యూ సి బ్బందికి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నష్టం అంచనా వేస్తున్నట్లు వారు తెలిపారు.
కొండకు ఆకతాయిలు నిప్పు
సిద్దవటం : సిద్దవటం రేంజ్‌లోని మద్దూరు, సిద్దవటం బీట్ల పరిసర ప్రాంతాల్లో కొండకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. చెట్లు, వన్య ప్రాణులు చనిపోకుండా కాపాడే యత్నం చేశారు. శుక్రవారం రాత్రి వరకు మంటలు కొనసాగాయి. శనివారం కూడా వెళ్తామని రేంజర్ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ కె.ఓబులేస్, బీటు, అసిస్టెంటు బీటు అధికారులు, ప్రొటెక్షన్ వాచర్‌లు, బేస్‌క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
కంచెకు నిప్పు..
ఓబులవారిపల్లె : మండల పరిధి గాడివారిపల్లె సమీపంలోని తోట కంచెకు నిప్పు అంటుకోవడంతో 7 ఎకరాల్లో అరటి, మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. గురువారం సాయంత్రం కంచెకు ఎవరో నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి తోటలకు వ్యాపించాయి. గ్రామంలోని వీసీ వెంకటసుబ్బారెడ్డికి చెందిన 3.5 ఎకరాలు, వీసీ రామసుబ్బారెడ్డికి చెందిన 3.5 ఎకరాలు, ముక్కా యల్లారెడ్డి నాగమణెమ్మకు చెందిన 1.54 ఎకరాల్లో తోటలు కాలిపోయాయి. దాదాపు వెయ్యి అరటి, యాబై మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment