రాయచోటి: ఎమ్మెల్యే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పోలీస్, సెక్టోరల్ అధికారులకు కలెక్టర్ గిరీషా పీఎస్ సూచించారు.శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజుతో కలిసి పోలీస్, సెక్టోరియల్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్, సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించాలన్నారు. ఓటర్లపై అధికంగా ప్రభావం చూపే సమస్యాత్మక ప్రాంతాలను పోలీసుల సహకారంతో గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఎన్నికల విధుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు.పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్‌ఓ సత్యనారాయణ, ఆర్డీఓలు, డీఎస్పీలు, పోలీస్, సెక్టోరియల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలి
ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలుపరిచి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఫ్యామిలీ డాక్టర్, అనీమియా తదితర అంశాలపై మెడికల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి ముంగిటే వైద్యసేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలుచేస్తోందని కలెక్టర్ అన్నారు. డాక్టర్లు ఇంటి దగ్గరకు వెళ్లి రోగులకు వైద్యసేవలు అందిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలు అనీమియా బారినపడకుండా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కంటి వెలుగు స్క్రీనింగ్ పక్కాగా జరగాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొండయ్య, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీషా పీఎస్
Comments
Please login to add a commentAdd a comment