మాట్లాడుతున్న జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజీ
కడప కల్చరల్ : జిల్లాలోని దేవదాయ భూముల విషయంలో సర్వే లెక్కలు పక్కాగా ఉండాలని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సి.శంకర్‌బాలాజీ అన్నారు. శుక్రవారం కడపలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన తనిఖీ అధికారులు, మండల కార్యనిర్వహణాధికారులు, కో ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 36 మండలాల్లో దేవదాయశాఖ భూములు సుమారు 14,596.53 ఎకరాలు ఉన్నాయన్నారు. భూ సర్వేలో భాగంగా మండల కార్యనిర్వాహణ అధికారులు, మండల కో ఆర్డినేటర్లు దేవాలయాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు సంబంధిత మండల తహసీల్దార్‌కు ఫారం–ఏ ద్వారా అందజేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దేవదాయశాఖకు సంబంధించిన భూముల విషయంలో అన్ని మండలాల తహసీల్దార్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యనిర్వాహణ అధికారులు సంబంధిత మండల తహసీల్దార్లకు ఫారం–ఏ రూపంలో జిల్లాలోని దేవదాయశాఖకు చెందిన అన్ని భూములు, తగిన రికార్డులు అందజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment