
రాయచోటి: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ కాటమనేనికి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్‌లో ఘనస్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం రాయచోటికి చేరుకున్న ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీషా పీఎస్ పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్‌ఓ సత్యనారాయణ ఎన్నికల పరిశీలకుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎన్నికల వ్రవర్తన నియమావళి అమలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు భాస్కర్ కాటమనేని జిల్లా అధికారులకు సూచించారు.