నాలుగు రోజుల్లో ఎలా సాధ్యం..?
జిల్లాలో సుమారు 20,04,581 మంది ఉండగా, వీరిలో 18,03,661 మంది ఈ– కేవైసీని నమోదు చేసుకొని ఉన్నారు. మిగిలిన 2,00,920 మంది ఇంకా చేసుకోవాల్సి ఉంది. వాస్తవానికి ప్రతి నెలా ఒకటి నుంచి 17 వరకే రేషన్ సరుకులను ఇస్తారు. ఈ తరుణంలో తమకు అనువైన తేదీలను లబ్ధిదారులు ఎంపిక చేసుకొని ఆ రోజుల్లో వీటిని పొందుతారు. నెలాఖరులో ఈ వ్యవహారాన్నే అసలు పట్టించుకోరు. ఈ క్రమంలో రానున్న నాలుగు రోజుల్లో వీరందరికీ సమాచారమిచ్చి, ప్రక్రియను జరపడం ఎంత వరకు సాధ్యమనే అనుమానం వ్యక్తమవుతోంది.


