జిల్లాలో రేషన్‌కార్డులిలా..
కావలి: రేషన్‌కార్డుదారులపై ఈ – కేవైసీ పిడుగు పడింది. పేదల గుర్తింపునకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ తరుణంలో ఇందులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ నెలాఖరులోపు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా చేయించుకోలేకపోతే వారికి ఇతర సంక్షేమ పథకాలు అందకుండాపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఉగాదిన ప్రారంభించనున్న పీ – 4 కార్యక్రమంలో తొలి ఎత్తు ఇదేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చేయించుకోలేదా.. సరుకులు బంద్
ఈ – కేవైసీని చేయించుకోకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సరుకులను పంపిణీ చేయరనే చర్చా నడుస్తోంది. సర్కార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు పొందే ప్రతి ఒక్కరూ తమ వేలిముద్ర వేసే ఈ – కేవైసీ ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఇది లేకపోయినా, సరుకులు సజావుగా అందేవి. అయితే ఇక నుంచి అలా కుదరదని, ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కార్డుతో అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేసి, డీలర్లకు ఆ సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో దీన్ని చేయించుకోని ఐదేళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారు రేషన్ షాపులకెళ్లి ఈ – పాస్ యంత్రంపై వేలిముద్ర వేసి, డీలర్ లాగిన్‌లో ఈ – కేవైసీని పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉందని పేర్కొంటున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటనలు
ఇప్పటికే గ్రామ / వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ.. ఈ – కేవైసీ కోసం వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న చిరుద్యోగులు, కూలీ పనులు చేసుకునే వారు దీనికి దూరమవుతున్నారు. ఈ కసరత్తుతో రేషన్‌కార్డులకు భారీగా కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రక్రియ జరగకపోతే సదరు రేషన్‌కార్డు రద్దు జాబితాలో చేరే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి 7,33,520
ప్రస్తుతం ఉన్నవి 7,21,567
కోతకు గురైనవి 11,953
ప్రతి నెలా సరుకుల పంపిణీ తీరిదీ..
(టన్నుల్లో)
బియ్యం – 10,500
కందిపప్పు – 700
చక్కెర – 340
వేలిముద్రలను నాలుగు రోజుల్లో సేకరించాల్సిందే
కుటుంబంలోని అందరూ
రావాలని హుకుం
31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
పేదలపై కూటమి ప్రభుత్వ కన్నెర్ర
నెలాఖరుకు పూర్తి చేయాల్సిందే
జిల్లాలో రేషన్‌్ కార్డుల లబ్ధిదారుల ఈ – కేవైసీ ప్రక్రియను ఈ నెలాఖరుకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందే. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ డీలర్ల వద్దకెళ్లి చేయించుకోవాలి. దీన్ని వేగవంతంగా పూర్తి చేయా లని ఆదేశాలు జారీ చేశాం.
– డి.అంకయ్య,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
జిల్లాలో రేషన్‌కార్డులిలా..
జిల్లాలో రేషన్‌కార్డులిలా..
జిల్లాలో రేషన్‌కార్డులిలా..
జిల్లాలో రేషన్‌కార్డులిలా..
జిల్లాలో రేషన్‌కార్డులిలా..


