మద్యం మత్తులో వీరంగం
● సచివాలయ అద్దాలు ధ్వంసం
అనుమసముద్రంపేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించి సచివాలయ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఏఎస్‌పేటలో చోటుచేసుకుంది. ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఎస్సై సైదులు తెలిపిన వివరాల మేరకు.. ఏఎస్‌పేట దర్గా ప్రాంతంలో షరీఫ్ అనే వ్యక్తి మానసిక రోగులకు ఆశ్రయ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఇతను బుధవారం రాత్రి పూటుగా మద్యం తాగి ముగ్గురు వ్యక్తులతో కలిసి సచివాలయ అద్దాలను పగులగొట్టాడు. గురువారం పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓకు తెలపడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment