
89 ఎర్రచందనం దుంగల పట్టివేత
రాపూరు : మండలంలోని మద్దెలమడుల చెక్‌పోస్టు వద్ద మంగళవారం 89 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి వైపు అధిక వేగంతో వెళుతున్న తమిళనాడుకు చెందిన మినీ ట్రక్‌ను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. ఎండు గడ్డి లోడ్‌తో ఉన్న ట్రక్‌ను వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. దీంతో వాహనంలో తనిఖీ చేయగా గడ్డి మోపుల కింద రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఎర్రచందనంతోపాటు వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు వెల్లడించారు. తనిఖీల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ వరప్రసాద్, చక్రపాణి, చంద్రశేఖర్, బీట్ అధికారులు షఫీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.