Top Stories
ప్రధాన వార్తలు

AP: ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, విజయవాడ: ఈ నెల 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కూటమి సర్కార్ స్పందించడం లేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) ప్రతినిధులు ప్రకటించారు. ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపారు.‘‘అప్పుల భారం మోయలేక, బాధలు భరించలేక.. ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ప్రతీ నెలా నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి రూ.330 కోట్ల రూపాయల సేవలు అందిస్తున్నాం. బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సగం కూడా రావడం లేదు. నెట్ వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు రూ. 3500 కోట్ల వరకూ పేరుకుపోయాయి. మందులు, పరికరాలు అప్పులిచ్చే కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి. బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆసుపత్రులు వైద్యులకు జీతాలిచ్చే పరిస్థితిలో లేవు’ అని హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.వైద్యసేవలు అందించలేని పరిస్థితి నెలకొందని మార్చి 7న నోటీసు పంపించాం. నోటీసు పంపించిన తర్వాత రూ.350 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మేం ఎప్పుడు డబ్బులు అడిగినా పాత బకాయిలు చెల్లించామనే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం చెల్లించే దానికంటే మేం ఎక్కువగానే సేవలు అందిస్తున్నాం. తొంభై శాతం ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 3300 ప్యాకేజీలకు సేవలు అందిస్తున్నాం. ప్రతీ నెలా బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రుల మనుగడే కష్టంగా మారింది. మాకు ఉన్న బకాయిల్లో రూ.1500 కోట్లు అత్యవసరంగా చెల్లించాలి. అలా చెల్లించలేని పక్షంలో మా సర్వీసులను మొదలు పెట్టే పరిస్థితి లేదు. కొత్త ఇన్స్యూరెన్స్ స్కీమ్‌కు వెళ్లేముందు ప్రభుత్వం మా బకాయిలన్నీ చెల్లించాలి’’ అని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్సీపీ
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ పేర్కొంది. రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లును తీసుకెళ్లిన క్రమంలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీతరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. వక్ఫ్ బిలలుకు టీడీపీ మద్దతు ఇచ్చి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.తమకు సిద్ధాంతాలు కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ చెప్పింది. ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లే కాదు.. విలువలను కూడా పాటించాలి. జేఏసీలో ముస్లింల అభ్యంతరాలను వైఎస్సార్‌సీపీస్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా ఉన్న బిల్లు చెల్లదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తోంది. మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం.వేలాది సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కల్గించడమే. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను చేర్చడం వారి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఆర్టికల్ 25 కు విరుద్ధం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కష్టాల్లో ఎస్ఆర్హెచ్..
KKR vs SRH Live Updates: ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి.12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 84/612 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(13), ప్యాట్ కమ్మిన్స్(6) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్‌నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన నితీశ్ కుమార.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(22), క్లాసెన్(1) ఉన్నారు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లుకష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లు 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తడబడుతోంది. కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(4), ఇషాన్ కిషన్(2), అభిషేక్ శర్మ(2) తీవ్ర నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్లోనే వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రింకూ సింగ్(24) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌రఘువన్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రఘువన్షి.. కమిందు మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్(5), రింకూ సింగ్(3) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్.. రహానే ఔట్‌అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రహానే.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(49), వెంకటేష్ అయ్యర్(1) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రహానే, రఘువంశీఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య రహానే(29) ఉన్నారు.కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఔట్ కాగా.. రెండో ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో సునీల్ నరైన్(7) ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో రహానే(1), రఘువంశీ(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్ వచ్చారు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

లాస్ట్ మినిట్‌లో వక్ఫ్ బిల్లుపై బీజేడీ యూటర్న్..
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.బీజేడీ తొలుత చెప్పింది ఇదే..‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

EPFO కీలక మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ఈపీఎఫ్ సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయని, ఆలస్యాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.డాక్యుమెంట్ అప్లోడ్ అవసరం లేదుఫిర్యాదులను తగ్గించడానికి, క్లెయిమ్‌లను దాఖలు చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలో భాగంగా ఆన్లైన్ క్లెయిమ్ చేసేటప్పుడు సభ్యులు చెక్ లీవ్స్ లేదా ధ్రువీకరించిన బ్యాంక్ పాస్‌బుక్ వివరాల స్కాన్ చిత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. గతంలో ఈ డాక్యుమెంట్లను నాసిరకంగా అప్లోడ్ చేయడం వల్ల చాలా క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి. ఈ ఆవశ్యకతను తొలగించడం ద్వారా, ప్రక్రియ సులభతరం కావడం కాకుండా క్లెయిమ్ ఆమోదం వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది.కంపెనీ ఆమోదం అక్కర్లేదు సభ్యుల బ్యాంకు ఖాతాలను వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్లతో (యూఏఎన్) అనుసంధానించే ప్రక్రియలో యజమాన్యం (కంపెనీ) అనుమతి అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. యూఏఎన్‌కు బ్యాంకుల ఖాతాల లింక్ కోసం సభ్యులు పెట్టుకున్న వినతులకు అనుమతులివ్వడంలో కొన్నిసార్లు యాజమాన్యాల వద్ద జాప్యం జరుగుతోంది. దీంతో క్లెయిమ్‌లు, ఇతర వాటి కోసం సభ్యులు సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తాజా మార్పుతో సభ్యులు ఇబ్బందులు తొలగుతాయి.Under the leadership of PM Shri @narendramodi ji, EPFO continues its reform journey! Two major reforms have been introduced to make the claim settlement process simpler, faster, and hassle-free for crores of EPF members & employers:✅ No need to upload image of cheque leaf/… pic.twitter.com/YScWOkw0gn— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 3, 2025

HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్ క్యూరీని రిట్ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది.

H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా నలబైమూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలకు భయపడి దేశాన్ని విడిచి వెళతారేమో.. ఆ పనిచేయొద్దని సూచిస్తున్నాయి. అమెరికా వీడే హెచ్1బీ వీసా దారులు భవిష్యత్‌లో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో,రాదోనన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఐటీ కంపెనీలు తమ హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అలెర్ట్ చేశాయి. దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి. అమెరికా వదలిసే వారి సొంత దేశాలకు వెళితే.. అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ హైలెట్ చేసింది.అయితే, హెచ్1బీ వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జన్మత: పౌరసత్వాన్ని రద్దు అమలైతే.. వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే అవకాశం ఉండదనే ఆందోళన చెందుతున్నారు. అమెరికా పౌరసత్వం లేకపోతే అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని మాట్లాడుతున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ప్రోగ్రామ్ కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టం ద్వారా 65,000 వీసాలను విదేశీయులకు అందిస్తుంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంటారు. ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా పౌరులకు అందిస్తుంది. హెచ్1బీ వీసా దారుల్ని అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి. ట్రంప్ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్లే ఏర్పడిన అనిశ్చితితో హెచ్1బీ వీసా దారులు మరిన్ని కష్టాల్ని ఎదుర్కోనున్నట్లు నివేదకలు తెలిపాయి.

‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీయూ భూముల్లో చేపడుతున్న పనులన్నింటిని నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులవుతారని హెచ్చరించింది. ఈమేరకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీంతో హెచ్‌సీయూలో పండుగ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.కంచ గచ్చిబౌలి భూముల్లో (kancha gachibowli land issue) 400 ఎకరాల వేలంపై వారం రోజులగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేమేని భీష్మించుకున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు తమ పోరాటానికి మద్దతుగా సుప్రీం కోర్టు ఉత్తర్వులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇది విద్యార్థుల విజయంమరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులపై రాజకీయ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయం. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చింది’ అని అన్నారు.స్ట్రేచర్ ఉందని విర్రవీగితే..సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిది అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. స్ట్రేచర్ ఉందని విర్రవీగితే.. చట్టం చూస్తూ ఊరుకోదు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినపుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండడం శుభ పరిణామం. ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేమికుల విజయం, సామాజిక వేత్తల విజయం.హెచ్‌సీయూ భూములు కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి అభినందనలు’ అని తెలిపారు. పర్యావరణ విధ్వంసంపై సుప్రీం ఆవేదన హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ నుంచి నివేదిక తెప్పించుకుని విచారించింది. విచారణ సందర్భంగా.. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో యదేశ్చగా చెట్లను నరకడంతో పాటు పర్యావరణాన్ని దెబ్బ తీయడం, జేసీబీలతో చెట్లను కొట్టేయడం,మూగజీవాల్ని హింసిస్తున్నారనే తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.ఎవరిచ్చారు మీకు ఆ హక్కు‘ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం. ఏ అధికారంతో చెట్లను ఎలా తొలగిస్తారాని పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. సీఎస్,జీహెచ్ఎంసీ కమీషనర్ ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమీషనర్‌తో పాటు పలువురి అధికారులను తొలగించింది. ఈనెల 16 కల్లా సీఈసీ పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

నాన్నా.. అమ్మ ఎక్కడ?.. ఏం చెప్పాలో తెలియని స్థితిలో తండ్రి
విశాఖ: నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు దీపక స్పృహలోకి వచ్చింది. అయితే ప్రేమోన్మాది దాడిలో తల్లి చనిపోయిందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగల ద్వారా అడిగింది. గొంతుపై ఆమెకు లోతైన గాయం కారణంగా ఆరు కుట్లు పడ్డాయి. దాంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె.. తల్లి గురించి సైగల ద్వారా ఆరా తీసింది. అయితే తల్లి మరణించదన్న వార్తను కూతురికి తండ్రి చెప్పలేకపోయాడు.ఇదిలా ఉండగా, తల్లి లక్ష్మి మృతదేహానికఇ పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పూర్తియిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడింది. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.

దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu)
టెస్లాకు మస్క్ రాజకీయాల సెగ.. అమ్మకాలు డౌన్
హెచ్ఎండీ నుంచి 2 మ్యూజిక్ ఫోన్లు
‘రియల్ ఎస్టేట్ వెంచర్లో శ్రీవారి ఆలయమా?’
డీఎస్సీ సిరాజ్‌కు సెల్యూట్.. ఆర్సీబీ ఓడను ముంచేశాడు: హర్భజన్
పొట్టి గౌనులో సుప్రీత హోయలు.. బ్లూ శారీలో అనసూయ అందాలు!
హృదయాలను హత్తుకునేలా ‘‘అనగా అనగా కథలా’ పాట
ఐపీఓ అరంగేట్రం.. రిక్రూట్మెంట్ కంపెనీ సన్నాహాలు
‘డియర్ ఉమ’ వచ్చేస్తోంది
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి షాక్
నితిన్‌తో లిప్‌లాక్ చేయలేనన్న నటి..ఇప్పుడేమో గ్లామర్ షోకి సై!
టెస్లాకు మస్క్ రాజకీయాల సెగ.. అమ్మకాలు డౌన్
హెచ్ఎండీ నుంచి 2 మ్యూజిక్ ఫోన్లు
‘రియల్ ఎస్టేట్ వెంచర్లో శ్రీవారి ఆలయమా?’
డీఎస్సీ సిరాజ్‌కు సెల్యూట్.. ఆర్సీబీ ఓడను ముంచేశాడు: హర్భజన్
పొట్టి గౌనులో సుప్రీత హోయలు.. బ్లూ శారీలో అనసూయ అందాలు!
హృదయాలను హత్తుకునేలా ‘‘అనగా అనగా కథలా’ పాట
ఐపీఓ అరంగేట్రం.. రిక్రూట్మెంట్ కంపెనీ సన్నాహాలు
‘డియర్ ఉమ’ వచ్చేస్తోంది
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి షాక్
నితిన్‌తో లిప్‌లాక్ చేయలేనన్న నటి..ఇప్పుడేమో గ్లామర్ షోకి సై!
సినిమా

ఓటీటీ ఆఫర్స్ రాలేదు..ఇది అది మార్చు అని ఇబ్బంది పెట్టారు: నవీన్ చంద్ర
ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆరేళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల అప్పుడు నటించిన ‘28°C’ మూవీకి బిజినెస్ జరగలేదు. ప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు.పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు "28°C" సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. "28°C" థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు యంగ్ హీరో నవీన్ చంద్ర అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్‌చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. "28°C" సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.→ "28°C" సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.→ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.→ కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.→ అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది.

'సంక్రాంతికి వస్తున్నాం' బాటలో జీవీ ప్రకాశ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం 'కింగ్స్టన్'. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అయితే ఈ మూవీ ఓకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీ తరహాలో ఓకేసారి రెండు ఓటీటీతో పాటు బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కింగ్స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీవీల్లో కేవలం జీ తమిళం ఛానెల్లో మాత్రమే ప్రసారం కానుంది.కాగా.. కింగ్స్టన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.(ఇది చదవండి: 'ఒకడి అత్యాశే ఊరిని మొత్తం నాశనం చేసింది'.. ఆసక్తిగా ట్రైలర్)అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.The sea calls. He answers! 🌊 🧟 #Kingston Arrives on 13th April! ⛵India's First Marine Fantasy Blockbuster #Kingston Premiering on OTT & TV on April 13th 12pm!#KingstonFromApril13thOnZEE5@gvprakash @storyteller_kp @ZeeStudiosSouth @ParallelUniPic @divyabarti2801… pic.twitter.com/QRPHkXcy6W— ZEE5 Tamil (@ZEE5Tamil) April 3, 2025

దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu)

సూపర్ హిట్ వెబ్ సిరీస్.. మళ్లీ వచ్చేస్తోంది
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు. ఏ సినిమా అయినా.. వెబ్ సిరీస్ అయినా ఓటీటీలోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఓటీటీల్లోనూ కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగానే ఉన్నాయి. వాటిలో పంచాయత్ వెబ్ సిరీస్ ఒకటి.ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్‌కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ వెబ్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ విషయాన్ని ప్రత్యేక వీడియో రిలీజ్ చేస్తూ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ తొలి సిరీస్ విడుదలై ఐదేళ్లు పూర్తి కావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. పంచాయత్ సీజన్- 4 ఈ ఏడాది జూలై 2న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
క్రీడలు

కష్టాల్లో ఎస్ఆర్హెచ్..
KKR vs SRH Live Updates: ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి.12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 84/612 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(13), ప్యాట్ కమ్మిన్స్(6) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్‌నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన నితీశ్ కుమార.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(22), క్లాసెన్(1) ఉన్నారు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లుకష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లు 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తడబడుతోంది. కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(4), ఇషాన్ కిషన్(2), అభిషేక్ శర్మ(2) తీవ్ర నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్లోనే వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రింకూ సింగ్(24) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌రఘువన్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రఘువన్షి.. కమిందు మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్(5), రింకూ సింగ్(3) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్.. రహానే ఔట్‌అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రహానే.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(49), వెంకటేష్ అయ్యర్(1) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రహానే, రఘువంశీఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య రహానే(29) ఉన్నారు.కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఔట్ కాగా.. రెండో ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో సునీల్ నరైన్(7) ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో రహానే(1), రఘువంశీ(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్ వచ్చారు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఏసీసీ నూతన చైర్మన్‌గా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కొత్త చైర్మన్‌గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యారు. శ్రీలంక క్రికెట్ (SLC) అధిపతి షమ్మీ సిల్వా స్థానంలో నఖ్వీ నియమితులయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన సంస్థ ఖండాంతర సభ్యుల ఆన్లైన్ సమావేశం ద్వారా ACC నాయకత్వ మార్పు నిర్ధారించబడింది. నఖ్వీ ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. చైర్మన్ మార్పుకు సంబంధించి ACC నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సమావేశానికి హాజరైన పలువురు సభ్యులు నఖ్వీ ఎన్నికైన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను నిర్వహించడం నఖ్వీ ముందున్న ప్రథమ పరీక్ష. వాస్తవానికి ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండింది. అయితే భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలు ఉండటం చేత టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం ఆసియా కప్ మీడియా హక్కులను విక్రయించే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఆసియా కప్‌ను నిర్వహించే తటస్థ దేశం ఏది అనేది నఖ్వీ నిర్ణయించాల్సి ఉంటుంది. టోర్నీ నిర్వహణ రేసులో యూఏఈ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ.. శ్రీలంక కూడా పోటీలో ఉంది.

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ మంచి మనసు
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ మొదలైదంటే ఈ సారి కప్ నమ్దే అంటూ అభిమానులు చేసే హంగామా ఎంత అంత కాదు. కనీసం 18వ సీజన్లోనైనా తమ ఆరాధ్య జట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్సీబీ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు.అజ్మల్ సుల్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆర్సీబీ జెర్సీ ధరించిన వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తానని ప్రకటించాడు. ఆర్సీబీ జెర్సీ ధరించి ఉంటే రైడ్ ఫ్రీ అని తన ఆటో వెనక అజ్మల్ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమానం అంటే ఇదే నీదేనే అన్నా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక ఐపీఎల్-2025 సీజన్లో ఆర్సీబీ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు అందుకున్న బెంగళూరు జట్టు.. బుధవారం తమ సొంతమైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) రాణించారు.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు సాయికిషోర్ రెండు, అర్షద్, ప్రసిద్ద్, ఇషాంత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. జోస్ బట్లర్(73) ఆజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయిసుదర్శన్(49) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.చదవండి: SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే: భారత మాజీ క్రికెటర్

IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఊహకందని ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్ తీసిన ఇషాంత్.. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన అరుదైన ఘనతను సాధించాడు. తొలి ఐపీఎల్ సీజన్లో (2008) నాటి ఆర్సీబీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. తాజాగా అదే ఫ్రాంచైజీ ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్‌ను పెవిలియన్‌కు పంపాడు.ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి రేర్ ఫీట్‌ను ఎవరూ సాధించలేదు. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన తొలి మరియు ఏకైక బౌలర్ ఇషాంత్ శర్మనే. 2008 సీజన్లో కేకేఆర్ తరఫున ఆడుతూ తన స్పెల్ తొలి ఓవర్లోనే నాటి ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ.. ఐపీఎల్ 2025 సీజన్లో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్‌ను కూడా తన స్పెల్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు.అప్పుడూ, ఇప్పుడూ ఆర్సీబీ కెప్టెన్లను ఔట్ చేసింది చిన్నస్వామి స్టేడియంలోనే కావడం మరో విశేషం. ఇక్కడ ఒకే ఒక్క తేడా ఏంటంటే.. నాడు తన స్పెల్ తొలి బంతికే ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. ప్రస్తుత సీజన్లో తన స్పెల్ రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఇషాంత్ ఒకడు. 36 ఏళ్ల ఈ ఢిల్లీ పేసర్ 2018 సీజన్ మినహాయించి ప్రతి ఐపీఎల్లో ఆడాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు చెలరేగడంతో ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు.
బిజినెస్

సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్‌లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం
మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) పథకం 2025 మార్చి 31 నుంచి నిలిపివేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA).. ఎంఎస్ఎస్సీ పథకం గడువు తరువాత కొనసాగదని అధికారికంగా వెల్లడించింది. కాబట్టి ఇకపై ఈ పథకం కింద కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులకు ఆస్కారం లేదు.మహిళల ఆర్థిక భద్రతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2023 బడ్జెట్ సమయంలో ఈ ఎంఎస్ఎస్సీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు పొదుపు చేసేందుకు ప్రోత్సాహం లభించింది. ఎంఎస్ఎస్సీ పథకం నిలిపివేయడం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్న మహిళలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. అయితే, మార్చి 31, 2025లోపు ఎంఎస్ఎస్సీలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం 7.5 శాతం వడ్డీ రేటుతో ప్రయోజనం ఉంటుంది.ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలుమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం మిస్ అయిన వారు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు.

వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్
న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాల రేట్లను 0.10 శాతం మేర పెంచుతున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటును ఆర్బీఐ ఇటీవలే పావు శాతం తగ్గించినప్పటికీ ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్), ట్రెజరీ బిల్లుల ఆధారిత రుణ రేటు (టీబీఎల్ఆర్), బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్), రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఆర్బీఎల్ఆర్)పై బ్యాంక్ అస్సెట్ లయబులిటీ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలను ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.ఇదీ చదవండి: పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (రెపో ఆధారితం/ఆర్బీఎల్ఆర్)ను 0.10 శాతం పెంచడంతో 8.95 శాతం నుంచి 9.05 శాతానికి చేరింది. 6 నెలల నుంచి మూడేళ్లలో కాలం తీరిపోయే రుణాలకు అమలు చేసే టీబీఎల్ఆర్ రేటును 0.05 శాతం తగ్గించడంతో 6.5 శాతానికి దిగొచ్చింది. బేస్ రేటును సైతం 0.05 శాతం తగ్గించగా, 9.80 శాతానికి చేరింది. సవరించిన రేట్లు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది.

ఐటీ షేర్లు పతనం.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలను ప్రకటించడంతో ఇండియన్ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ అన్ని యూఎస్ దిగుమతులపై బేస్‌లైన్ 10 శాతం పన్నును కలిగి ఉన్న కొత్త టారిఫ్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. వాణిజ్య మిగులు ఉన్న దేశాలపై అదనపు అధిక సుంకాలను విధించించారు. భారత్ ఇప్పుడు అమెరికా నుంచి 27 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 322.08 పాయింట్లు (0.42 శాతం) క్షీణించి 76,295.36 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 76,493.74 -75,807.55 రేంజ్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 82.25 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 23,250.10 వద్ద స్థిరపడింది.టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగియడంతో బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 18 నష్టాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ 4.57 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.58 శాతం పెరగడంతో స్మాల్ క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లను మించిపోయాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.21 శాతం నష్టపోగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, టీసీఎస్, ఎంఫాసిస్ సూచీలు నష్టపోయాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగాలు కూడా తక్కువ పనితీరు కనబరిచాయి.నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.25 శాతానికి పైగా లాభపడటంతో ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకులు, హెల్త్ కేర్, ఎఫ్ ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.94 శాతం వరకు లాభపడ్డాయి.
ఫ్యామిలీ

నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్ డా.మధుకర్ గైక్వాడ్ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్ గైక్వాడ్అద్దాల మేడలూ కారణమే ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్మెంట్పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅకాల వర్షాలకు అవకాశం వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీచదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!

ప్రపంచ సమస్యలను-ఆర్ట్‌ని మిళితం చేసే వంటకాలు..చూస్తే మతిపోతుంది..!
ఎన్నో రకాల రెస్టారెంట్ వంటకాలు చూసుంటారు. కానీ ఇలాంటి వంటకాల తీరుని మాత్రం అస్సలు ?చూసుండరు. ఆర్డర్ చేస్తే ఎప్పుడొస్తుందా.. ? అని గంటలతరబడి వెయిట్ చేయాలి. తీరా ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాకా..తినడం మర్చిపోతాం. అలా ఉంటుంది ఆ రెస్టారెంట్ వడ్డించే తీరు. వంటకాలు లిస్ట్ పెద్దదే..ఆ డెజర్ట్‌లు వడ్డించే తీరు ఊహకు దొరకదు..ప్రశంసకు అందదు అన్నట్లుగా ఉంటాయి ఆ వంటకాలు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..కోపెన్‌హాగన్‌లోని రెఫ్షాలియోన్ జిల్లాలో ఉన్న ఆల్కెమిస్ట్ అనే రెస్టారెంట్లో ఇలా చిత్రమైన రీతీలో వంటకాలను వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ రెండు మిచెలిన్ స్టార్లను దక్కించుకుంది. అక్కడ భోజనం ఓ గొప్ప విషయాన్ని బోధిస్తాయి. అందుకోసం అయినా అక్కడకు వెళ్లి తీరాల్సిందే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి వంటకాన్ని.. పాకకళకు థియేటర్ అండ్ మల్టీమీడియా ఆర్ట్‌తో మిళితం చేసి.. కస్టమర్లకు సర్వ్ చేస్తుంది. వడ్డించే ప్రతి వంటకం..ఆహార కొరత, పర్యావరణ ఆందోళనలు, సామాజిక న్యాయం వంటి ప్రపంచ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లుగా క్రియేటివిటీగా అందిస్తారు. అంతేకాదండోయ్ మెనూలో మొత్తం 40 రకాల వంటకాలను అందిస్తుంది. ఆర్డర్ కోసం గంటల తరబడి వెయిట్ చేయక తప్పదు. పైగా ధరలు కూడా కళ్లు చెదిరిపోయే రేంజ్లో ఉంటాయి. ఈ హోటల్లో తినాలంటే ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి..ఆర్డర్ కోసం ఎలాంటి వాళ్లైనా.. తప్పక వెయిట్ చేయాల్సిందే. అక్కడ తింటే సుమారు రూ. 60 వేలు పైనే ఖర్చు అవుతుందట. అత్యంత డిమాండ్ ఉన్న ఈ రెస్టారెంట్లో వంటకాలకు సంబధించిన వీడియోని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ నెట్టిట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గతేడాది ఆ రెస్టారెంట్లో అందించిన వంటకాలు కనిపిస్తాయి. తినదగిన సీతాకోక చిలుకల రూపంలో డిజర్ట్ చూస్తే ప్రోటీన్ వనరులుగా కీటకాలును తినొచ్చు అని హైలెట్ చేస్తుంది. ఇంకా పచ్చి జెల్లీ ఫిష్, తినదగిన ప్లాస్టిక్‌లో చుట్టబడిన చేప (సముద్ర కాలుష్యం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో), సోర్ క్రీంతో చదును చేయబడిన కోడి తల, పాడైనట్లు కనిపించే చీజ్, బోనులో కోడి పాదాలు (ఇది వ్యవసాయం పరిస్థితిని వివరించడం కోసం), పంది, జింక రక్తంలతో చేసిన స్వీట్(రక్తదానం ప్రాముఖ్యత కోసం)..ఇలా ప్రతి వంటకం ఒక్కో ప్రపంచ సమస్యను వివరించేలా అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రెజెంట్ చేశారు. వాటిని చూస్తే మతిపోవడం ఖాయం అనేలా ఉంటాయి. నెటిజన్లు మాత్రం మరీ ఇంత లగ్జరీయస్ గానా..! అని, మరికొందరూ..ఆహారం రూపంలో ప్రపంచ సమస్యలను హైలెట్ చేసేలా కళను కూడా జోడించడం అంటే మాటలు కాదు అని సదరు రెస్టారెంట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Tiff (@greenonionbun)(చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..)

ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!

రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!
పెంపుడు జంతువులంటే చాలామందికి ఇష్టం. వాటిని యజమానులు తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకు వెళ్తుంటారు. అంత వరకు ఓకే గానీ..కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడూ వాటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో అక్కడుండే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తించుకోవాలి. ఇవేం పట్టకుండా ఓ కుక్క యజమాని ఏదో రకంగా రైలుని క్యాచ్ చేయబోయి..పాపం ఆ మూగప్రాణి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టాడు. అసలేం జరిగిందంటే..ఓ యజమాని తన కుక్క తోపాటు రైలు ఎక్కాలన్న తొందరలో ఉన్నాడు. అయితే అప్పటికే ఫ్లాట్‌ఫాంపై రైలు కదిలిపోతోంది. ఏదో రకంగా ఆ కదులుతున్న రైలుని ఎక్కాలని యత్నిస్తున్నాడు. అయితే తనతో ఉన్న కుక్క ఎందుకనో ఎక్కేందుకు ప్రయత్నించలేదు. రైలు కదిలిపోతుండటంతో ఎక్కేందుకు భయపడిందో ఏమో గానీ ఎంతలా యజమాని అదిలించినా అది రైలు ఎక్కేందుకు జంప్ చేయలేదు. ఆ యజమాని ఆ కుక్కల హడావిడి నడుమ అనూహ్యంగా ఆ కుక్క రైలుకి-ఫ్లాట్‌ఫాంకి మధ్యన పడిపోయింది. ఇక అంతే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు, యజమాని అందరూ ఆ కుక్క ఎలా ఉందో? ఏంటో? అని ఊపిరిబిగపెట్టి చూస్తున్నారు. ఓ పక్కన రైలు వేగంగా వెళ్లిపోతుంది. అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ కుక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి గదా అని మండిపడుతూ పోస్టులు పెట్టారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..)
ఫొటోలు


అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిద్ది కుమార్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!


రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)


మూడేళ్ల వయసులో తల్లి దూరం.. తండ్రి రెండో పెళ్లి.. బామ్మే అమ్మగా మారి! (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)


స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ (ఫోటోలు)


కూతురు 'శివియా'తో హీరోయిన్ సంగీత.. వైరల్ ఫోటోలు చూశారా..?


ఖరీదైన అపార్ట్ మెంట్ అమ్మేసిన హీరో షారూక్ భార్య (ఫొటోలు)


Sharwanand : కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శర్వానంద్ పూజలు (ఫోటోలు)


ఆ హెలికాప్టర్ షాట్‌కు 14 ఏళ్లు.. సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించిన ధోని..! (ఫొటోలు)


ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లే భార్యకు సీమంతం (ఫొటోలు)
అంతర్జాతీయం

ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
అమెరికాతో చర్చలకు ఇరాన్ రాని పక్షంలో.. ఒకవేళ మంతనాలకు ఇరాన్ వచ్చినా చర్చలు విఫలమయ్యే పక్షంలో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపేందుకు ఇరాన్ భూభాగంపై లక్ష్యాలుగా ఎంచుకునే మూడు కీలక అణు స్థావరాలు.. నతాంజ్, ఫర్దో, ఇస్ఫహాన్. ఒక చోట అని కాకుండా ఇరాన్ గడ్డపై పలు ప్రాంతాల్లో అణు కార్యక్రమం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నుంచి వైమానిక దాడుల ముప్పు పొంచివున్న నేపథ్యంలో రక్షణ కోసం కొన్ని అణు స్థావరాలను భూగర్భంలో ఇరాన్ నిర్మించుకుంది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఇరాన్ 2015లో పీ5 (పర్మినెంట్5/ఐరాసలో శాశ్వత సభ్యత్వం గల) దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అణు కార్యక్రమాన్ని చాలావరకు నిలిపివేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది. అంతేకాకుండా తమ అణు స్థావరాల్లో అంతర్జాతీయ తనిఖీలను అనుమతించేందుకు అంగీకరించింది. ఒప్పందం అమల్లో ఉన్నా ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేక్ పడలేదన్న కారణంతో ట్రంప్ తొలి హయాంలో 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇదే అదనుగా ఇరాన్ కూడా తమ అణు కార్యక్రమంపై ఆయా దేశాలు విధించిన ఆంక్షలను ఆ మరుసటి ఏడాది నుంచి విస్మరించడం ఆరంభించింది. అలా ఒప్పందం విచ్ఛిన్నమవడంతో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ విస్తరించింది. భారీ అణుశక్తి..2015 నాటి ఒప్పందం అమలైతే ఇరాన్ అణుబాంబు తయారీకి కావాల్సిన వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి కనీసం సంవత్సర కాలం పట్టేది. ఎప్పుడైతే ఒప్పందం విఫలమైందో ఆ వెంటనే యురేనియం శుద్ధిని ఇరాన్ వేగవంతం చేసింది. ఫలితంగా వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తి కాలాన్ని ఏడాది నుంచి కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వ్యవధికి ఇరాన్ గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇరాన్ ప్రస్తుతం రెండు ప్రదేశాల్లో యురేనియంను 60% ఫిజైల్ ప్యూరిటీ వరకు శుద్ధి చేస్తోంది. దీని అర్థం 90% వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి ఇరాన్ చేరువైనట్టే. శుద్ధితో యురేనియం స్వచ్ఛత పెరిగేకొద్దీ కేంద్రక విచ్ఛిత్తి (విస్ఫోటన) సామర్థ్యం అధికమవుతుంది. సైద్ధాంతికంగా చూస్తే.. యురేనియం శుద్ధిని మరింత కొనసాగిస్తే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు ఇరాన్ దగ్గరున్న యురేనియంతో ఆరు అణుబాంబులు రెడీ అవుతాయి!.నతాంజ్.. భూగర్భంలో మూడంతస్తులు! రాజధాని టెహ్రాన్ నగరానికి దక్షిణంగా నతాంజ్ వద్ద భూగర్భంలో ఒకటి (ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్), భూమి ఉపరితలంపై ఒకటి (పైలట్ ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్) చొప్పున రెండు యురేనియం శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో భూగర్భ ప్లాంటులో ప్రస్తుతం 16 వేల సెంట్రీఫ్యూజెస్ ఉండగా 13 వేల సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. ఇవి యురేనియంను 5% స్వచ్ఛత వరకు శుద్ధి చేస్తున్నాయి. భూగర్భంలో మూడు అంతస్తుల్లో ఈ ప్లాంట్ ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ భూగర్భ స్థావరాన్ని ఎంతవరకు నాశనం చేయగలవనేది ప్రశ్నార్థకం. ఇక భూ ఉపరితలంపై ఉన్న ప్లాంటులో వందల సెంట్రీఫ్యూజెస్ మాత్రమే ఉన్నప్పటికీ 60% స్వచ్ఛత వరకు యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోంది. ఏమిటీ సెంట్రీఫ్యూజెస్? యురేనియం శుద్ధి ప్రక్రియలో సెంట్రీఫ్యూజెస్ పాత్ర కీలకం. సహజ యురేనియంలో యురేనియం-238 అధికంగా, యురేనియం-235 స్వల్పంగా (0.7%) ఉంటాయి. అణు ఇంధనం తయారీకి ఎక్కువ గాఢతతో కూడిన యురేనియం-235 కావాలి. యురేనియం-238 నుంచి యురేనియం-235ను వేరుచేయడానికి అపకేంద్ర బలాన్ని సెంట్రీఫ్యూజెస్ ఉపయోగించుకుంటాయి. సెంట్రీఫ్యూజెస్ నిమిషానికి 50 వేల రౌండ్లు తిరుగుతాయి. ఈ ప్రక్రియలో భార అణువులు కేంద్రానికి దూరంగా తోసివేయబడితే, తేలికపాటి అణువులు కేంద్రానికి దగ్గరగా వస్తాయి. యురేనియంను వాయువు (యూఎఫ్6)గా మార్చి వేగంగా తిరిగే సిలిండర్ల (సెంట్రీఫ్యూజెస్)లోకి పంపుతారు. అధిక సాంద్రతతో కూడిన యురేనియం-238 గల భార యూఎఫ్6 అణువులు ఆ సిలిండర్ల వెలుపలి అంచుల వద్దకు, అల్ప సాంద్రతతో కూడిన యురేనియం-235 గల తేలికపాటి యూఎఫ్6 అణువులు కేంద్రం వద్దకు చేరతాయి. అలా యురేనియం-235ను వేరుచేసి తర్వాత దశకు పంపుతారు. బాగా శుద్ధి అయిన (హైలీ ఎన్రిచ్ద్) యురేనియంను అణ్వాయుధాల తయారీలోనూ, అల్ప శుద్ధి (లో ఎన్రిచ్ద్) యురేనియంను అణు రియాక్టర్లలో వినియోగిస్తారు. Telegraph: Current US bombs not enough to penetrate Iran's nuclear facilities!The American B-2 bomber can penetrate to a depth of 61 meters, but the Natanz and Fordow nuclear facilities in Iran are built at a depth of 80 to 100 meters.In addition, Iran's facilities are… pic.twitter.com/lcDi8GMKAN— Sprinter Observer (@SprinterObserve) December 24, 2024ఫర్దో.. పర్వతగర్భంలో! భద్రత పరంగా నతాంజ్ భూగర్భ ప్లాంటు కంటే ఫర్దోలోని యురేనియం శుద్ధి కేంద్రం ఉత్తమమైనది. ఎందుకంటే దీన్ని పర్వతాన్ని తొలిచి నిర్మించారు. ఇక్కడ రెండు వేల దాకా సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మూడో తరానికి చెందిన అత్యాధునిక ఐఆర్-6 సెంట్రీఫ్యూజ్ యంత్రాలను వినియోగిస్తుండటం విశేషం. ఇస్ఫహాన్.. శుద్ధి చేసిన యురేనియం నిల్వ! దేశంలో రెండో అతి పెద్ద నగరం ఇస్ఫహాన్. ఇరాన్ ఇక్కడ భారీ న్యూక్లియర్ టెక్నాలజీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఫ్యూయెల్ ప్లేట్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీలో యురేనియంను ‘యురేనియం హెక్సాఫ్లోరైడ్ (యూఎఫ్6)గా మార్చి సెంట్రీఫ్యూజెస్ యంత్రాల్లోకి పంపుతారు. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఇక్కడే నిల్వ చేస్తుంది.-జమ్ముల శ్రీకాంత్.Natanz for uranium enrichment. Underground enrichment facility of this center is protected by a concrete shield with a thickness of approximately 7.6 meters📍33°43'29.8"N 51°43'33.9" pic.twitter.com/jHffMnchWE— 𝓂𝒶𝓇𝒾𝑜🇱🇧🇬🇧🇦🇪 (@MarioLeb79) March 31, 2025

పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో మహా భూకంపం (Mega quake) రానుందా? దీని తీవ్రతకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రశ్నలకు ‘అదే జరగవచ్చు’ అంటూ జపాన్ తన అంచనాలను, భవిష్యవాణిని వెల్లడించింది. ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ (Agence France-Presse) (ఏఎప్పీ) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసింది. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుంది.ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను మరువక ముందే జపాన్ మహాభూకంపం అంచనాలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.జపాన్ ప్రభుత్వం (Japanese Government) తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది. దీని కారణంగా సునామీ వస్తుందని, ఇదే జరిగితే జపాన్‌లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని పేర్కొంది. మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు నాశనమవుతుందని పేర్కొంది. అందుకే మెగా భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వెల్లడించింది.భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వార్తా సంస్థ ఏఎప్పీ నివేదిక ప్రకారం జపాన్‌లో 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (అంటే రూ. 171 లక్షల కోట్లకు పైగా) నష్టపోతుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్‌కు చాలా భారంగా మారుతుంది.ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్

భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శించింది.

ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
జాతీయం

ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. లాలూ ప్రసాద్ వీపు, చేతులపై పుండ్లు పడినట్లు సమాచారం. దీంతో బుధవారం రాత్రి ఆయన్ని కార్డియో క్రిటికల్ కేర్ యూనిట్(CCU)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లాలూ వెంట ఆయన సతీమణి రబ్రీదేవి ఉన్నారు. వాస్తవానికి.. బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరినప్పటికీ.. విమానాశ్రయానికి చేరుకోగానే ఒక్కసారిగా రక్తపోటులో తేడా కనిపించింది. దీంతో వెంటనే పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న అనంతరం ఢిల్లీ తరలించారు.లాలూ ఆరోగ్యంపై ఆయన తనయుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. పరాస్ ఆసుపత్రి నుంచి లాలూను తొలుత ఎయిర్ అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రయాణికుల విమానంలో వెళ్తానని చెప్పడంతో తీసుకెళ్లినట్లు చెప్పారు. తన తండ్రి చాలా ధైర్యవంతుడన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని తేజస్వి అంటున్నారు. 76 ఏళ్ల చాలా ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతుండడంతో ఇప్పటికే గుండె, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గత ఏడాది జూలైలో ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్నారు.

మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: మావోయిస్టులతో చర్చలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఈ క్రమంలో షరతులు లేకుండా చర్చలు తమ ప్రభుత్వ్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టమైన ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావాలని సూచించారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల లేఖపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. షరతులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.మావోయిస్టులు నిజంగా తిరిగి రావాలనుకుంటే వారు తమ ప్రతినిధులను, చర్చల నిబంధనలను స్పష్టం చేయాలి. ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలను అంగీకరించాలి. గతంలో మావోయిస్టుల కంచుకోటలుగా పేరొందిన 40 గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. మావోయిస్టులు చర్చల పట్ల సీరియస్‌గా ఉంటే చర్చల కోసం వారే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి’ అని తెలిపారు.

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
గాంధీ నగర్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్ నగర్లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ మృతిచెందారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్ మృతి చెందినట్టు వెల్లడించారు. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్‌ను జామ్‌నగర్‌లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025ఇదిలా ఉండగా.. మార్చి నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.Tragic news tonight. Trainee IAF fighter pilot killed in Jaguar crash near Jamnagar. The other pilot managed to eject, being treated in hospital.Deepest condolences to the family of the deceased pilot. 💔 pic.twitter.com/bQy6bG1918— Shiv Aroor (@ShivAroor) April 2, 2025 An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…— Indian Air Force (@IAF_MCC) April 3, 2025
ఎన్ఆర్ఐ

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.
క్రైమ్

‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
రంగారెడ్డి జిల్లా : సంచలనం సృష్టించిన విదేశీ యువతిపై అత్యాచార ఘటనలో రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నిందితుడు మహ్మద్ అస్లాంను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేవలం గంట రెండుగంటల వ్యవధిలోనే నిందితుడు యువతితో పాటు ఆమె స్నేహితుడిని అంతగా ఎలా నమ్మించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన నిందితుడికి ఆంగ్లంపై పట్టుండటంతో చలాకీగా మాట్లాడి ఆకర్షించాడా.. వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్న నిందితుడు.. గతంలో కూడా ఇదే తరహా ఏవైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అస్లాం ఇలాంటి ఘటనకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, విజిటింగ్ వీసాపై జర్మనీ నుంచి వచ్చిన యువతిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు భారత్‌లోని జర్మన్ కాన్సులేట్‌కు నివేదికను పంపనున్నారు. ఇదిలా ఉండగా, మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న ఆ యువతి గురువారం అర్ధరాత్రి తిరిగి స్వదేశానికి వెళ్లనుంది.

ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
హైదరాబాద్: సికింద్రాబాద్–మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి యత్నం ఘటన నుంచి బైటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమెను ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మార్చి 22న రాత్రి ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు దాడిచేయటంతో, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి కిందకుదూకిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతాలకు శస్త్ర చికిత్సలు చేయించారు. పది రోజులపాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు ధృవీకరించటంతో సొంత ఊరికి పంపించినట్టు పోలీసులు తెలిపారు.

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


Ambati Rambabu: నారా లోకేష్ ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలి


వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP


విశాఖలో తీవ్ర విషాదం


ఎన్ఆన్ఐలకు చెందిన స్థలాలపై కబ్జారాయుళ్ల దృష్టి


విజయ్ దేవరకొండ సినిమాపై నాగవంశీ కామెంట్స్


IPL : సిరాజ్ పగ కోహ్లి ఫ్యూజులౌట్


కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే


Prakash Raj: పవన్ సనాతన వేషం వెనుక రహస్యం


హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం


రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు