Top Stories
ప్రధాన వార్తలు

పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం.

పాక్‌కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్‌పై చర్యలివే... – సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్) కింద పాక్ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్. – భారత్, పాక్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్ హై కమిషన్ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.

65 దాటితే 'నో' పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను మరింత పెంచింది. రాష్రాల్లో పథకం అమలులో దుర్వినియోగానికి తావులేకుండా పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పథకం పనుల ప్లానింగ్, మంజూరులో సైతం మార్పులు తెచ్చింది. ఇందుకోసం ‘యుక్తధార’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఇస్రో – నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో అనుసంధానం చేసింది. తద్వారా ఈ పనులను తన నియంత్రణలోకి తీసుకుంటోంది. ఈ విధానం వల్ల ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చాలా వరకు తగ్గిపోతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. చాలా కాలం నుంచి ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను కేంద్రమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇటీవల మెటీరియల్ కేటగిరీ (సిమెంట్ రోడ్లు లేదా ఇతర కూలీలను ఉపయోగించని) పనుల బిల్లులనూ నేరుగా కేంద్రమే ఆ వ్యక్తులకు, సంస్థలకు చెల్లిస్తోంది. ఇందులో రాష్ట్రాలు వాటి వాటా 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాకు జమ చేస్తేనే కేంద్రం 75 శాతం వాటా కలిపి బిల్లులు చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకం పనుల ప్రణాళిక, అమలును కూడా కేంద్రమే ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది.వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమలు..ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ఏటా పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం పనుల కల్పన, ప్రణాళికల రూపకల్పన ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ముందే అక్టోబరు–ఫిబ్రవరి నెలల మధ్య రాష్ట్ర స్థాయిలో జరుగుతుండేది. ఈ ప్రణాళికలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చి నెలలో రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి వాటికి లేబర్ బడ్జెట్ పేరుతో ఆమోదం తెలిపేది. కొత్తగా గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్‌లో తీర్మానం అనంతరం మంజూరు చేసేవారు. కేంద్రం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఇకపై ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్రం ఒకేసారి ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వారీగా లేబర్ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఏడాది మధ్యలో పనులు మంజూరు కావు. ఇలా ఏడాది ప్రణాళిక రూపకల్పనకు ‘యుక్తధార’ మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ ఏప్రిల్ 1 నుంచి మండలానికి ఒక గ్రామ పంచాయతీ చొప్పున ఈ విధానం అమలు చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.పనుల గుర్తింపు కూడా సాంకేతికతోనే.. ఈ పథకంలో అవకతవకలకు సైతం వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో చేపట్టడానికి అవకాశం లేని పనులను ప్రణాళికలో చేర్చే అవకాశం ‘యుక్తధార’ యాప్‌లో ఉండదని చెబుతున్నారు. యాప్ పూర్తిగా ఇస్రో ఆధ్వర్యంలో సమగ్ర గూగుల్ మ్యాప్‌నకు అనుసంధానమై ఉండటం వల్ల చెరువులు ఉన్న ప్రాంతంలోనే వాటి పూడిక తీత పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు. కొన్ని రకాల పనులకు ఆ ప్రాంత భూగర్భ పరిస్థితులు అనుకూలమా లేదా అన్నది కూడా పని నిర్ధారణ సమయంలోనే తెలిసిపోతుందని వివరించారు. తద్వారా పనుల గుర్తింపులో అక్రమాలకు తెరపడుతుందని చెబుతున్నారు.దొంగ మస్టర్లకూ చెక్! ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకూ కేంద్రం చెక్ పెట్టబోతోంది. దీని ప్రకారం ఒక ప్రదేశంలో కూలీలు పనిచేసే సమయంలో రోజూ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఫొటో తీయాలి. ఆ ఫోటోలో ఉన్న కూలీల సంఖ్య, అక్కడ పనికి హాజరైనట్టు సిబ్బంది మస్టర్ షీట్లో నమోదు చేసే కూలీల సంఖ్య ఒక్కటిగా ఉంటేనే ఆ రోజు వేతనాల చెల్లింపు జరుగుతుంది. ఫోటోలో, మస్టర్ షీట్లో సంఖ్యలో తేడా ఉంటే ఆ మస్టర్ షీటును పరిగణనలోకి కూడా తీసుకోరు.ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో యాప్ అనుసంధానంప్రస్తుతం ఈ పథకం పనుల ప్రణాళిక ఆఫ్ లైన్ విధానంలో రూపొందించి, ఎంత మంది పేదలకు పనులు కల్పిస్తారో సంఖ్య మాత్రమే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆ పనుల నంబర్లను పోర్టల్‌లో ఎంటర్ చేసి, వాటికి బిల్లులు పెడుతున్నారు. కొత్త విధానంలో మొబైల్ యాప్ ద్వారా ప్రణాళిక పూర్తిగా ఆన్లైన్లో రూపొందుతుంది. ఏ పంచాయతీలో ఏ రకమైన పనిని ఏ ప్రదేశంలో చేపడతారో గూగుల్ మ్యాప్‌లో గుర్తించి, యాప్‌లో నమోదు చేస్తారు.ఈ యాప్ పూర్తిగా ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇలా అన్ని పనులు జియో ట్యాగింగ్ చేసి, మ్యాప్‌లోనే ఒక్కో పనికి ఒక్కో నంబరును కేటాయిస్తారు. ప్రతి పనికి అంచనా విలువ సైతం యాప్‌లోనే నమోదు చేస్తారు. ఏ పనికి బిల్లులు పెట్టాలన్నా యాప్‌లో నమోదు చేసిన ప్రకారం వర్క్ ఐడీలను ఎంపిక చేసుకొని బిల్లులు పెట్టాలి.

మళ్లీ ఉగ్ర కాండ!
ఊరు తెలియదు, పేరు తెలియదు... ఎవరో, ఎక్కడివారో అసలే తెలియదు. తమ ప్రాంతం కాదు... భాష కాదు. అలాంటివారిని నిష్కారణంగా, నిర్దయగా కాల్చి చంపడం హేయం, దారుణం. కశ్మీర్‌లోని పహల్గావ్‌ు సమీపంలోని బైసారన్ పట్టణంలో పర్యాటకులపై విరుచుకుపడి 28 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు అక్షరాలా మానవాకార మృగాలు. భయకంపితులు తమకు తాము ధైర్యం తెచ్చుకోవటానికి సాగించే క్రూర చర్యే బీభత్సమని మార్క్సిస్టు సిద్ధాంతవేత్త ఫ్రెడరిక్ ఏంగెల్స్ అంటాడు. వీళ్లు నిజంగా భీరువులు. పొరుగు దేశం చేతుల్లో పావులు. ఈ ఘోరానికి ఎంచుకున్న సమయం, సందర్భం గమనిస్తే ఇది యాదృచ్ఛికంగా, చెదురుమదురుగా జరిగిన దాడి కాదని స్పష్టంగా తెలుస్తుంది. మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన సౌదీ అరేబియా పర్యటనకెళ్లారు. అంతర్జాతీయంగా అందరి దృష్టీ పడాలంటే ఇంతకన్నా మెరుగైన సమయం లేదని వీరిని వెనకుండి నడిపించిన పాకిస్తాన్‌లోని సూత్రధారులు అనుకున్న పర్యవ సానంగానే ఈ దారుణం చోటుచేసుకుంది. దాడికి తెగబడిన ఏడుగురూ సైనిక దుస్తుల్లో ఆ ప్రాంతంలోకి చొరబడ్డారని, వారిలో దాదాపు అయిదుగురు పాకిస్తానీ పౌరులేనని అంటున్నారు. ఈ దాడిని కేంద్రం చాలా తీవ్రంగా తీసుకున్నదని ప్రధాని అర్ధంతరంగా తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని రావడాన్ని గమనిస్తే అర్ధమవుతుంది. మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం హుటాహుటిన సమావేశమైంది. కాల్పుల్లో గాయపడినవారూ, తప్పించుకున్నవారూ చెబుతున్న కథనాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పెళ్లయి కేవలం ఆరు రోజులే అయిన జంటను ఆ దుర్మార్గులు లక్ష్యంగా ఎంచుకుని భర్తను కాల్చిచంపటం ఎలాంటి వారికైనా కంటతడి పెట్టిస్తుంది. తమ దురంతాన్ని ప్రధానికి చెప్పుకోవాలని, అందుకే ప్రాణాలతో విడిచిపెడుతున్నా మని నవవధువుతో వారు చెప్పిన తీరు గమనిస్తే ఉన్మాదం ఏ స్థాయిలో ముదిరిందో తెలుస్తుంది. ఒక ప్రాంతాన్ని బలప్రయోగం ద్వారానైనా సొంతం చేసుకోవాలని, దానిపై సర్వహక్కులూ తమకే ఉన్నాయని ఒక దేశమైనా, ఒక ముఠా అయినా భావించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధా రణ పౌరులను లక్ష్యంగా ఎంచుకుని సంహరిస్తే మందీమార్బలంవున్న ప్రభుత్వం లొంగిపోతుంద నుకోవటం పిచ్చితనమని ఈ ఉన్మాదులూ, వీరి వెనకుండి ప్రోత్సహిస్తున్నవారూ గ్రహించలేక పోతున్నారు. ఈ మధ్యే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కశ్మీర్ తమ కంఠనాళమని, దాన్ని మరిచిపోయే లేదా విడనాడే ప్రసక్తేలేదని ప్రకటించారు. కానీ ఈ దుస్సంఘటన జరిగిన వెంటనే దీనితో తమకు సంబంధం లేదంటూ పాత పాటే అందుకున్నారు. తాను పెంచి పోషించిన విష సర్పం తననే కాటేస్తున్న ఉదంతాలున్నా పాక్ మూర్ఖంగా ప్రవర్తిసోంది. ఉగ్రవాదుల మతిమాలిన చర్యలకు అక్కడి సమాజం మద్దతు లేదని బుధవారం వెలువడిన పత్రికలు చూస్తేనే తెలుస్తుంది. అక్కడి పత్రికలన్నీ ముష్కరుల దురంతానికి నిరసనగా నల్లటి కాగి తంపై తెల్లటి అక్షరాలతో మొదటి పేజీని నింపాయి. పాలక పక్షానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, హురియత్ కాన్ఫరెన్స్‌తోపాటు పౌర సమాజం మొత్తం దాడిని ముక్తకంఠంతో ఖండించింది. పర్యాటకులపై ఈ స్థాయిలో విరుచుకుపడటం 2012 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సంవత్సరం బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు మహారాష్ట్ర నుంచి వెళ్లిన నలుగురు మహిళా పర్యాటకులను పొట్టన బెట్టుకున్నారు. అంతకుముందు పహల్గామ్లో 2000 సంవత్సరంలో తీర్థ యాత్రల కోసం వచ్చిన 32 మంది ప్రాణాలు తీశారు. ఆ తర్వాత ఇదే పెద్ద దాడి. జమ్మూ–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని 2019 ఆగస్టులో కేంద్రం రద్దు చేసిన నాటినుంచీ తీసుకున్న చర్యల వల్ల అక్కడ పరిస్థితులు మెరుగు పడుతున్నాయన్న అభిప్రాయం అందరిలో కలిగింది. కానీ అదంతా నిజం కాకపోవచ్చని అడపా దడపా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. అందుకే భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. ఇటీవల జరిగిన దాడుల్లో కూలిపనుల కోసం వెళ్లే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారు. కానీ మంగళవారం నాటి ఘటన తీరు గమనిస్తే వారి వ్యూహం మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. కశ్మీర్లో ఉగ్రవాదం కోరలు పీకామని, ఇక అక్కడేం చేయలేక జమ్మూ ప్రాంతంలో మిలిటెంట్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈమధ్యే జమ్మూ, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. ఉగ్రవాదం ఎప్పుడు పడగవిప్పి బుసలు కొడుతుందో అంచనా వేయటం సులభం కాదు. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం పర్యాటకులపై దాడి జరిగే అవకాశం వున్నదని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అదే నిజమైతే లోటుపాట్లకు కారకులైనవారిపై కఠినంగా చర్య తీసుకో వాల్సిన అవసరం వుంది. అందాల కశ్మీరాన్ని తనివితీరా చూడాలని, స్థానిక రుచులను ఆస్వాదించి అక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకోవాలని దేశం నలుమూలల నుంచీ అనేకమంది నిత్యం అక్కడికెళ్తున్నారు. ఇప్పుడు ఉగ్రదాడిలో మరణించినవారిలో కూడా భిన్న రాష్ట్రాలకు చెందిన వారున్నారు. దాడికి దిగిన ముఠా సభ్యులు ఎటునుంచి వచ్చారో తెలుసుకోవటం, వారిని సజీవంగా పట్టుకుని విషయాలు రాబట్టడం, అంతర్జాతీయంగా పాక్ నిజస్వరూపాన్ని చాటడం అత్యవసరం. దేశం మొత్తం ఏకమై ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన తరుణమిది. అందుకే బాధ్యతా యుతంగా మాట్లాడటం అవసరమని రాజకీయ పక్షాలన్నీ గ్రహించాలి.

రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
ఐపీఎల్–2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది... గత ఏడాది రన్నరప్ ఈసారి పేలవ ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది...ముంబై పేసర్లు బౌల్ట్, చహర్ ధాటికి 13/4 వద్ద నిలిచి, ఆపై ఎలాగోలా 143 వరకు చేరినా... ఆ స్కోరు ఓటమిని తప్పించలేకపోయింది. రోహిత్ శర్మ మరో చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించగా మరో 26 బంతుల ముందే ముంబై విజయతీరం చేరింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో మ్యాచ్ మ్యాచ్‌కీ జోరు పెంచుతూ చెలరేగుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గింది. ముందుగా రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆదుకున్న క్లాసెన్... ఒకటి, రెండు, మూడు, నాలుగు... సన్‌రైజర్స్ టాప్–4 బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఇన్నింగ్స్ మరీ పేలవంగా ప్రారంభమైంది. హెడ్ (0), అభిషేక్ శర్మ (8), నితీశ్ కుమార్ రెడ్డి (2) చెత్త షాట్లు ఆడి నిష్క్రమించగా, ఇషాన్ కిషన్ (1) తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఈ సీజన్లో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు (24) సన్‌రైజర్స్ నమోదు చేసింది. కొద్దిసేపటికి అనికేత్ వర్మ (12) కూడా వెనుదిరగడంతో 35/5 వద్ద రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. స్కోరు 100 దాటుతుందా అనే సందేహం కనిపించింది. బ్యాటింగ్ కుప్పకూలటంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అదనపు బ్యాటర్ మనోహర్‌ను తీసుకోవాల్సి వచ్చింది. క్లాసెన్, మనోహర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. 34 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. క్లాసెన్, మనోహర్ ఆరో వికెట్‌కు 63 బంతుల్లో 99 పరుగులు జోడించారు. చకచకా లక్ష్యం వైపు... స్వల్ప ఛేదనలో ముంబై ఆరంభంలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, విల్ జాక్స్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 46 బంతుల్లోనే 64 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. జాక్స్ వెనుదిరిగిన తర్వాత రోహిత్‌కు సూర్య జత కలిశాడు. 35 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హర్షల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మరింత జోరు ప్రదర్శించిన రోహిత్ ఎట్టకేలకు విజయానికి మరో 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) నమన్ (బి) బౌల్ట్ 0; అభిషేక్ (సి) పుతూర్ (బి) బౌల్ట్ 8; ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 1; నితీశ్ రెడ్డి (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 2; క్లాసెన్ (సి) తిలక్ (బి) బుమ్రా 71; అనికేత్ (సి) రికెల్టన్ (బి) పాండ్యా 12; మనోహర్ (హిట్ వికెట్) (బి) బౌల్ట్ 43; కమిన్స్ (బి) బౌల్ట్ 1; హర్షల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–13, 4–13, 5–35, 6–134, 7–142, 8–143. బౌలింగ్: దీపక్ చహర్ 4–0– 12–2, బౌల్ట్ 4–0–26–4, బుమ్రా 4–0–39–1, సాంట్నర్ 4–0–19–0, పాండ్యా 3–0–31–1, పుతూర్ 1–0–15–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి అండ్ బి) ఉనాద్కట్ 11; రోహిత్ (సి) అభిషేక్ (బి) మలింగ 70; జాక్స్ (సి)మనోహర్ (బి) అన్సారీ 22; సూర్యకుమార్ (నాటౌట్) 40; తిలక్‌వర్మ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–77, 3–130. బౌలింగ్: కమిన్స్ 3–0–31–0, ఉనాద్కట్ 3–0–25–1, హర్షల్ 3–0–21–0, ఇషాన్ మలింగ 3–0–33–1, అన్సారీ 3.4–0–36–1. అవుట్ కాకుండానే... సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దీపక్ చహర్ వేసిన బంతి అతని లెగ్‌సైడ్ దిశగా వెళ్లగా కిషన్ గ్లాన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ రికెల్టన్ బంతిని అందుకున్న మరుక్షణమే కిషన్ అవుట్‌గా భావించి స్వచ్ఛందంగా పెవిలియన్ వైపు నడిచాడు. నిజానికి ముంబై ఆటగాళ్లు ఎవరూ గట్టిగా అప్పీల్ కూడా చేయకపోగా... అంపైర్ వినోద్ శేషన్ కూడా వైడ్‌గా ప్రకటించేందుకు రెండు చేతులు పైకెత్తబోయాడు. అయితే కిషన్ స్పందనను చూసిన అతను తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్‌గా ఖాయం చేశాడు. కిషన్ తనంతట తానే వెళ్లిపోవడాన్ని ముంబై కెప్టెన్ పాండ్యా భుజం తట్టి మరీ అభినందించాడు. అయితే ఆ తర్వాత రీప్లేల్లో అతని బ్యాట్‌కు బంతి తగల్లేదని, నాటౌట్ అని తేలింది. ఇషాన్ కిషన్ అతిగా స్పందించకుండా ఉంటే వికెట్ చేజారేదే కాదు.ఐపీఎల్లో నేడుబెంగళూరు X రాజస్తాన్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్.. అప్డేట్స్భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్ మిస్రీవిదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంపాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదుపహల్గాం దాడివెనుక పాక్ హస్తం ఉందిమా దగ్గర పూర్తి ఆధారాలున్నాయిఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాంఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాంఅటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును మూసివేస్తున్నాంపాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్ఈటీ విభాగం అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్? ముజాహిదీలు కశ్మీర్లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్ సాయంత్రం కేబినెట్ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంకేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్ విధానం : రాజ్‌నాథ్‌ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌పహల్గామ్ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్.. ఆరేళ్లలో తొలిసారి బంద్! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో తొలిసారి బంద్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్ హైకమిషన్ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ట్వీట్ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్ వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్లో చొరబడినట్లు అనుమానంఅదిల్, అషన్ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్ బ్లాక్ రేంజ్లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్ మౌంటెడ్ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్ కవ్వింపు చర్యలుపాక్ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్ ఐఎస్ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్ కశ్మీర్ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్‌లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.

నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం. కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ. హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే! ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. నోబెల్ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న శ్రద్ధ.పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్ సంకల్పం చేశాం.నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం. నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్

రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయ భేరి మోగించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది.ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.
చి‘వరి’కి ఇంతేనా?
‘రెస్క్యూ’ కొనసాగించాలా.. వద్దా?
చిన్నస్వామిలో చిందేసేనా!
సహజ పరాజయం
నీరజ్ ఆహ్వానానికి నదీమ్ నో
శ్రీలంక జట్టులో భారీ మార్పులు
విజేత హంపి
రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
65 దాటితే 'నో' పదవి
చివరి నిమిషంలో సమావేశం రద్దు..
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
మళ్లీ ఉగ్ర కాండ!
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
పాక్‌కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
సంచలన విజయం దిశగా జింబాబ్వే
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
గన్నవరం విమానాశ్రయం రికార్డు
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
65 దాటితే 'నో' పదవి
యాపిల్, మెటాకు భారీ వేలకోట్లు జరిమానా
3 నిమిషాల్లో హతమార్చేశారు!
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
ఇక చాలు.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
కర్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ
టర్కీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజల పరుగులు
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
పహల్గాం దాడికి దీటుగా బదులిస్తాం
తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
ఏడాది పాటు డైట్ చేశా.. బురద సీన్ సవాల్‌గా అనిపించింది: విజయశాంతి
సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
నాకు నువ్వు వద్దు!
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
'అజిత్' అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన సాంగ్ విడుదల
నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
భారీగా తగ్గిన బంగారం ధర
కటాఫ్టైమ్లో సెబీ మార్పులు
చైనాలో 10జీ నెట్వర్క్..!
పహల్గాం ఘటనను ఖండించిన హీరో కృష్ణసాయి
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
ఓటీటీలోకి కామెడీ మూవీ 'బ్రొమాన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మన షిప్‌యార్డు మినీ 'రత్న'o!
శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానాలు
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
పొగచూరి ఎండతగలక..
సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పంపిణీతో ఏపీకి తీరని నష్టం
అది పరువు హత్యే...!
ఇదేంధ‘రొయ్యో’..!
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
ఒక్క మరుగుదొడ్డీ లేదా?
కుంభమేళా తరహాలో తరలిరండి: కవిత
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
మళ్లీ ఉగ్ర కాండ!
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
పాక్‌కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
సంచలన విజయం దిశగా జింబాబ్వే
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
గన్నవరం విమానాశ్రయం రికార్డు
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
65 దాటితే 'నో' పదవి
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
యాపిల్, మెటాకు భారీ వేలకోట్లు జరిమానా
3 నిమిషాల్లో హతమార్చేశారు!
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ఇక చాలు.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
కర్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
టర్కీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజల పరుగులు
ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్
పహల్గాం దాడికి దీటుగా బదులిస్తాం
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!
ఏడాది పాటు డైట్ చేశా.. బురద సీన్ సవాల్‌గా అనిపించింది: విజయశాంతి
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
నాకు నువ్వు వద్దు!
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
'అజిత్' అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన సాంగ్ విడుదల
భారీగా తగ్గిన బంగారం ధర
కటాఫ్టైమ్లో సెబీ మార్పులు
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
చైనాలో 10జీ నెట్వర్క్..!
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
ఓటీటీలోకి కామెడీ మూవీ 'బ్రొమాన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పహల్గాం ఘటనను ఖండించిన హీరో కృష్ణసాయి
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
సినిమా

ఓటీటీలోకి కామెడీ మూవీ 'బ్రొమాన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాల్ని డబ్ చేసి నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తుంటారు. అలా దాదాపు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలో కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో మనకు పరిచయమైన సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్ తో పాటు అర్జున్ అశోకన్, మహిమ నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'బ్రొమాన్స్'. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఫిబ్రవరి 14న రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు రెండున్నర నెలల తర్వాత అంటే మే 1 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) 'బ్రొమాన్స్' విషయానికొస్తే.. బింటో (మాథ్యూ థామస్) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంటాడు. ఇతడి అన్నయ్య షింటో (శ్యామ్) కొచ్చిలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటాడు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోస బింటో.. కూర్గ్ వెళ్లగా.. అన్నయ్య కనిపించకుండా పోయాడనే విషయం తెలుస్తుంది.దీంతో అన్నయ్యని వెతికేందుకు బింటో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇతడికి షబీర్, ఐశ్వర్య, హరిహరసుధాన్, కొరియర్ బాబు అని నలుగురు వ్యక్తులు కలుస్తారు. వీళ్లందరూ కలిసి షింటోని వెతికుతుంటారు. మరి చివరకు షింటో దొరికాడా? ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) Chaos, comedy, and a gang you’ll never forget. Watch #Bromance streaming from May 1 on SonyLIV pic.twitter.com/mjgYqjnDok— Sony LIV (@SonyLIV) April 23, 2025

ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో(OTT Movie) మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వాటి ఒరిజినల్ వెర్షన్స్ కొందరు చూస్తుంటారు. కానీ చాలామంది తెలుగు ఆడియెన్స్ మాత్రం తెలుగులో డబ్ చేస్తే చూద్దామని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ క్యూట్ లవ్ స్టోరీ మూవీ వచ్చేసింది. గతేడాది మార్చిలో మలయాళంలో రిలీజైన సినిమా 'జననం 1947 ప్రణయం తుడరున్'. 70 ఏళ్ల వయసున్న ఓ మహిళ, పురుషుడు ప్రేమలో పడితే అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. దీన్ని దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత తెలుగులో ఇప్పుడు రిలీజ్ చేశారు. ఒరిజినల్ అమెజాన్ ప్రైమ్ లో ఉండగా.. ప్రస్తుతం ఆహాలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) '1947 ప్రణయం'(1947 Pranayam Movie) పేరుతో దీన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సినిమా విషయానికొస్తే.. శివ(జయరాజ్ కొజికోడ్) ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంటాడు. అక్కడే ఉంటున్న గౌరీ అనే రిటైర్డ్ టీచర్.. శివని చూసి ఇష్టపడుతుంది. అతడితో కలిసి ఉండాలనుకుంటుంది. దీనికి అనుమతి దక్కడంతో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తారు. మరి ఓల్డేజ్ ప్రేమకథ చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఈ వీకెండ్ కి ఇది మంచి ఆప్షన్ కావొచ్చు. మరోవైపు ఈ వారం థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా సినిమాలు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఎల్ 2 ఎంపురాన్, వీరధీరసూర చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)

'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా నా సినిమాలు ఉంటాయి' అంటున్నాడు దర్శకుడు, నటుడు సుందర్.సి. ఈయన ఇటీవలే మదగజరాజ సినిమాతో హిట్టందుకున్నాడు. నిజానికి ఇది 2012లో రావాల్సిన సినిమా. కానీ ఎందుకో విడుదలకు నోచుకోలేదు. విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 12న విడుదలై విజయం సాధించింది.డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవ్ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సుందర్. సి (Sundar C) మాట్లాడుతూ.. నా సినిమా ప్రతి ఒక్కరూ చూసేలా ఉండాలని కోరుకుంటాను. అందుకే డబుల్ మీనింగ్ డైలాగులు రాయను. ఒకవేళ ఏవైనా ద్వంద్వార్థాలు ఉండే డైలాగ్స్ కనిపించాయంటే అవి కేవలం ప్రేక్షకులు ఊహించుకుంటున్నవే కానీ నేను మాత్రం ఆ ఉద్దేశంతో రాయలేదు.ఐటం సాంగ్స్ ఉండవ్స్క్రిప్టు రాసే దగ్గరి నుంచి షూటింగ్ వరకు ఎక్కడా డబుల్ మీనింగ్స్కు, అసభ్యతకు చోటు లేకుండా జాగ్రత్తపడతాను. అలా అని నా సినిమాల్లో గ్లామర్ లేకుండా ఉండదు. కాకపోతే ఆ గ్లామర్‌ను ఎలా చూపిస్తున్నానన్నది ముఖ్యం. ఉదాహరణకు చీరకట్టుకున్న అమ్మాయిని రకరకాల యాంగిల్స్‌లో ఇంకోలా చూపించొచ్చు. నేను మాత్రం అలాంటి పని చేయను. నేను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వీలుగా విజువల్స్ ఉండాలని భావిస్తాను. అలాగే నా సినిమాల్లో ఐటం సాంగ్స్ ఉండవు.. నా చిత్రాలు ఫ్యామిలీ ఫ్రెండ్లీలా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.మరి ఇదేంటి సార్?ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెట్టారు. అతడు రాసిన డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను, కాస్త ఓవర్‌డోస్‌గా ఉన్న సన్నివేశాలను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు తీస్తే.. అరణ్మనై మూవీ (Aranmanai Movie)లో స్విమ్మింగ్ పూల్ సీన్ దేనికుందో మరి?, అంబాలా మూవీలో మద్రాస్ టు మధురై ఐటం సాంగ్ ఉందిగా.. అరణ్మనైలో తమన్నా, రాశీలతో డ్యాన్స్ చేయిస్తూ క్లోజ్ షాట్స్‌లో చిత్రీకరించావుగా.. అంటూ పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాఇకపోతే సుందర్.. మెట్టుకుడి, అరుణాచలం, అంబే శివం, లండన్, రెండు, అరణ్మనై (నాలుగు భాగాలు), యాక్షన్, కాఫీ విత్ కాదల్, మదగజరాజ వంటి పలు సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు కొన్నింటిలో నటించాడు కూడా! ఈయన ప్రస్తుతం దర్శకుడిగా, నటుడిగా గ్యాంగర్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కమెడియన్ వడివేలు, కేథరిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదల కానుంది. 🤣pic.twitter.com/bOWN7aANH1— Prakash Mahadevan (@PrakashMahadev) April 20, 2025 I love Sundar C glamour but I can't digest the fact he is not accepting. He has the most naughtiest frames in Kollywood but carefully escaping— 𝐒𝐔𝐍𝐈𝐋 𝐓𝐇𝐈𝐋𝐀𝐊 (@sunil_thilak) April 20, 2025చదవండి: RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్

ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పలు కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అర్చన కొట్టిగె(Archana Kottige) పెళ్లి చేసుకుంది. తన రాష్ట్రానికి చెందిన శరత్ అనే క్రికెటర్ తో కొత్త జీవితం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2018 నుంచి ఇండస్ట్రీలో ఉన్న అర్చన.. డియర్ సత్య, యెల్లో గ్యాంగ్స్, విజయానంద్, హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే తదితర సినిమాల్లో నటించింది. ఈమె వయసు ప్రస్తుతం 28 ఏళ్లే. అయితేనేం కర్ణాటక తరఫున క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బీఆర్(Sharath Br)ని పెళ్లి చేసుకుంది. బుధవారం ఉదయం సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి(Heroine Wedding) జరిగింది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)ఇకపోతే మంగళవారం రాత్రి అర్చన-శరత్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. కాంతార హీరోయిన్ సప్తమి గౌడతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలానే శరత్ కోసం కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ, యష్ దయాల్, దేవదత్ పడిక్కల్ తదితరులు హాజరయ్యారు.కర్ణాటక తరఫున అండర్-23 ఆడిన శరత్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. గతేడాది ఐపీఎల్ లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. కనీస ధర రూ.20 లక్షలకు ఇతడిని టీమ్ దక్కించుకుంది. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకోవడంతో సినీ, క్రికెట్ సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్)
న్యూస్ పాడ్‌కాస్ట్

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం
క్రీడలు

విజేత హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి, చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఈ టోర్నీలో నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారుకాగా... నల్ల పావులతో తక్కువ గేమ్‌లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. 10 మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. ఎనిమిది రౌండ్లు ముగిశాక 6 పాయింట్లతో హంపి, జినెర్ సమఉజ్జీగా ఉన్నారు. చివరి రౌండ్ గేముల్లో హంపి 84 ఎత్తుల్లో సలీమోవా (బల్గేరియా)పై, జినెర్ 76 ఎత్తుల్లో పొలీనా (రష్యా)పై గెలిచారు. దివ్య (భారత్)–అలీనా పోలాండ్) గేమ్ 42 ఎత్తుల్లో... హారిక శ్రీ(భారత్)–మున్‌గున్‌తుల్ (మంగోలియా) గేమ్ 40 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–సలోమి (జార్జియా) గేమ్ 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. 2024–2025 గ్రాండ్ ప్రి సిరీస్‌లో మొత్తం ఆరు టోర్నీలు ఉండగా... ఇప్పటికి ఐదు ముగిశాయి. ఒక్కో ప్లేయర్ గరిష్టంగా మూడింటిలో పాల్గొనాలి. హంపికి సంబంధించి మూడు టోర్నీలు ముగిశాయి. ఓవరాల్ పట్టికలో హంపి 279.17 పాయింట్లతో రెండో స్థానంలో... గొర్యాక్చినా (రష్యా) 308.34 పాయింట్లతో అగ్రస్థానంలో ... జినెర్ 235 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. జినెర్‌కు మరో టోర్నీ మిగిలి ఉంది. టాప్–2లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.

రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
ఐపీఎల్–2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది... గత ఏడాది రన్నరప్ ఈసారి పేలవ ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది...ముంబై పేసర్లు బౌల్ట్, చహర్ ధాటికి 13/4 వద్ద నిలిచి, ఆపై ఎలాగోలా 143 వరకు చేరినా... ఆ స్కోరు ఓటమిని తప్పించలేకపోయింది. రోహిత్ శర్మ మరో చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించగా మరో 26 బంతుల ముందే ముంబై విజయతీరం చేరింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో మ్యాచ్ మ్యాచ్‌కీ జోరు పెంచుతూ చెలరేగుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గింది. ముందుగా రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆదుకున్న క్లాసెన్... ఒకటి, రెండు, మూడు, నాలుగు... సన్‌రైజర్స్ టాప్–4 బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఇన్నింగ్స్ మరీ పేలవంగా ప్రారంభమైంది. హెడ్ (0), అభిషేక్ శర్మ (8), నితీశ్ కుమార్ రెడ్డి (2) చెత్త షాట్లు ఆడి నిష్క్రమించగా, ఇషాన్ కిషన్ (1) తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఈ సీజన్లో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు (24) సన్‌రైజర్స్ నమోదు చేసింది. కొద్దిసేపటికి అనికేత్ వర్మ (12) కూడా వెనుదిరగడంతో 35/5 వద్ద రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. స్కోరు 100 దాటుతుందా అనే సందేహం కనిపించింది. బ్యాటింగ్ కుప్పకూలటంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అదనపు బ్యాటర్ మనోహర్‌ను తీసుకోవాల్సి వచ్చింది. క్లాసెన్, మనోహర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. 34 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. క్లాసెన్, మనోహర్ ఆరో వికెట్‌కు 63 బంతుల్లో 99 పరుగులు జోడించారు. చకచకా లక్ష్యం వైపు... స్వల్ప ఛేదనలో ముంబై ఆరంభంలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, విల్ జాక్స్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 46 బంతుల్లోనే 64 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. జాక్స్ వెనుదిరిగిన తర్వాత రోహిత్‌కు సూర్య జత కలిశాడు. 35 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హర్షల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మరింత జోరు ప్రదర్శించిన రోహిత్ ఎట్టకేలకు విజయానికి మరో 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) నమన్ (బి) బౌల్ట్ 0; అభిషేక్ (సి) పుతూర్ (బి) బౌల్ట్ 8; ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 1; నితీశ్ రెడ్డి (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 2; క్లాసెన్ (సి) తిలక్ (బి) బుమ్రా 71; అనికేత్ (సి) రికెల్టన్ (బి) పాండ్యా 12; మనోహర్ (హిట్ వికెట్) (బి) బౌల్ట్ 43; కమిన్స్ (బి) బౌల్ట్ 1; హర్షల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–13, 4–13, 5–35, 6–134, 7–142, 8–143. బౌలింగ్: దీపక్ చహర్ 4–0– 12–2, బౌల్ట్ 4–0–26–4, బుమ్రా 4–0–39–1, సాంట్నర్ 4–0–19–0, పాండ్యా 3–0–31–1, పుతూర్ 1–0–15–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి అండ్ బి) ఉనాద్కట్ 11; రోహిత్ (సి) అభిషేక్ (బి) మలింగ 70; జాక్స్ (సి)మనోహర్ (బి) అన్సారీ 22; సూర్యకుమార్ (నాటౌట్) 40; తిలక్‌వర్మ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–77, 3–130. బౌలింగ్: కమిన్స్ 3–0–31–0, ఉనాద్కట్ 3–0–25–1, హర్షల్ 3–0–21–0, ఇషాన్ మలింగ 3–0–33–1, అన్సారీ 3.4–0–36–1. అవుట్ కాకుండానే... సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దీపక్ చహర్ వేసిన బంతి అతని లెగ్‌సైడ్ దిశగా వెళ్లగా కిషన్ గ్లాన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ రికెల్టన్ బంతిని అందుకున్న మరుక్షణమే కిషన్ అవుట్‌గా భావించి స్వచ్ఛందంగా పెవిలియన్ వైపు నడిచాడు. నిజానికి ముంబై ఆటగాళ్లు ఎవరూ గట్టిగా అప్పీల్ కూడా చేయకపోగా... అంపైర్ వినోద్ శేషన్ కూడా వైడ్‌గా ప్రకటించేందుకు రెండు చేతులు పైకెత్తబోయాడు. అయితే కిషన్ స్పందనను చూసిన అతను తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్‌గా ఖాయం చేశాడు. కిషన్ తనంతట తానే వెళ్లిపోవడాన్ని ముంబై కెప్టెన్ పాండ్యా భుజం తట్టి మరీ అభినందించాడు. అయితే ఆ తర్వాత రీప్లేల్లో అతని బ్యాట్‌కు బంతి తగల్లేదని, నాటౌట్ అని తేలింది. ఇషాన్ కిషన్ అతిగా స్పందించకుండా ఉంటే వికెట్ చేజారేదే కాదు.ఐపీఎల్లో నేడుబెంగళూరు X రాజస్తాన్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయ భేరి మోగించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది.ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.

IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్‌తో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో బుమ్రా కంటే ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(318) ఉన్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అదేవిధంగా మరో ఘనతను బుమ్రా ఈ మ్యాచ్‌లో సాధించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(170) రికార్డును బుమ్రా సమం చేశాడు.మరో వికెట్ పడగొడితే మలింగను జస్ప్రీత్ అధిగమిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 39 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లు వీరే యుజ్వేంద్ర చాహల్ - 373పీయూష్ చావ్లా - 319భువనేశ్వర్ కుమార్ - 318రవిచంద్రన్ అశ్విన్ - 315జస్ప్రీత్ బుమ్రా - 300
బిజినెస్

అప్పుడు పనిగంటలు.. ఇప్పుడు సెలవులు
పనిగంటలపై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే మరుగున పడుతున్న సమయంలో.. తాజాగా సెలవుల సంస్కృతికి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఒక్క నెలలోనే (ఏప్రిల్ 2025) ఏకంగా 17 సెలవులు ఉన్నాయంటూ.. క్లీన్రూమ్స్ కంటైన్మెంట్స్ వ్యవస్థాపకులు & సీఈఓ 'రవికుమార్ తుమ్మలచర్ల' చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశ సాంస్కృతి, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని మనం ఎంతో గౌరవిస్తున్నాము. వారాంతాలతో కలిపి ప్రభుత్వ సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ కారణంగా.. పనులు వాయిదా పడుతున్నాయి. ఏప్రిల్ 2025లో, మాకు 10 కంటే ఎక్కువ సెలవులు వచ్చాయి. సెలవులు అధికం కావడంతో ముఖ్యమైన ఫైల్స్ ఆఫీసుల్లో కదలకుండా నిలిచిపోతున్నాయి.మేము భారతీయ.. పాశ్చాత్య సంప్రదాయాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అయితే ఇదే సమయంలో ఉత్పాదకతను కోల్పోకుండా చూసుకోవాలి. ఉత్పాదకత తగ్గితే.. అది దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వేగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే చైనా 60 సంవత్సరాలు ముందుంది.భారతదేశంలో మనం మాత్రం వేగవంతమైన ప్రక్రియల కోసం విదేశాలకు వలసపోతాము. కాబట్టి మన సెలవు సంస్కృతిని పునరాలోచించాలి. మెరుగైన సమతుల్యతను సాధించాలి. ఇదే సరైన సమయం అంటూ.. సెలవుల జాబితాను రవికుమార్ తుమ్మలచర్ల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ప్రభుత్వ సంస్థలను ట్యాగ్ చేశారు.ఇదీ చదవండి: ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!రవికుమార్ తుమ్మలచర్ల షేర్ చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈయన అభిప్రాయంపై ఏకీభవిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి పోస్టులు ఎప్పుడు యజమాని నుంచే వస్తాయి. ఉద్యోగి ఎప్పుడూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటాడు అని చెబుతున్నారు. సెలవులు అంటే ఆర్థిక కార్యకలాపాలలో విరామం మాత్రమే కాదు, అవి ఉద్యోగులు రీఛార్జ్ అవ్వడానికి తగిన సమయం అని కూడా ఇంకొందరు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
టెక్ పరిశ్రమలో అనిశ్చితులు ఇప్పట్లో కుదటపడేలా కనిపించడం లేదు. టాప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. తమ వర్క్ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోన్న ఇంటెల్ ఈ వారంలోనే లేఆఫ్‌లను ప్రకటించబోతోంది.గత మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఇంటెల్ కంపెనీ ఈ వారం 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో 19 బిలియన్ డాలర్ల నష్టంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంటెల్, ఈ కోతలతో అధికారిక వ్యవస్థను తగ్గించి, నిర్వహణను సరళీకరించి, ఇంజనీరింగ్-ఆధారిత సంస్కృతిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదే మొదటిసారి కాదు...ఇంటెల్ తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉద్యోగాల కోతలను చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. అంతకుముందు సంవత్సరం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.రోజుకు 450 మంది తొలగింపు2025లో 257 టెక్ కంపెనీలు రోజుకు సగటున 450 మంది చొప్పున 50,372 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. 2024లో 1,115 కంపెనీల్లో 2,38,461 మంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఇంటెల్ మాత్రమే కాకుండా గూగుల్ 2025 ఏప్రిల్‌లో తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్ (ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్)లో వందలాది మందిని తొలగించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్ విభాగాల ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది.మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వచ్చే మే నెలలో తొలగింపులకు సిద్ధమవుతోంది. ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తులను పెంచడానికి మిడిల్ మేనేజర్లు, తక్కువ పనితీరు కనబరిచేవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా దాని భద్రతా విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి పనితీరు ఆధారిత తొలగింపులపై దృష్టి సారించింది.

భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Drop: దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) నేడు (ఏప్రిల్ 23) భారీగా దిగివచ్చాయి. అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను మార్క్‌ను దాటేసిన పసిడి ధర ఈరోజు అత్యంత భారీగా తగ్గి రూ.లక్ష దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 23 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి. 👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,11,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

తొలి ఐపీవో వచ్చేస్తోంది..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 25న షేర్లను ఆఫర్ చేయనుంది.ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. అంతేకాకుండా రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్స్చేంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మూన్ బెవరేజెస్ ఐపీవో యోచన గ్లోబల్ పానీయాల దిగ్గజం కోక కోలా బాట్లర్ మూన్ బెవరేజెస్ (Moon Beverages IPO) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో భారీగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఎంఎంజీ గ్రూప్ కంపెనీ వైస్‌చైర్మన్ అనంత్ అగర్వాల్ తెలియజేశారు. రానున్న మూడు, నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా ఇప్పటికే రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.వెరసి కొత్త ప్లాంట్లు, సామర్థ్య విస్తరణ, కొత్త మార్కెట్లలో ప్రవేశం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. అస్సామ్‌లోని గువాహటి, ఒడిషాలోని రూర్కెలాలో ఏర్పాటవుతున్న ప్లాంట్లపై మరిన్ని పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. దీంతో నిమిషానికి 7,000 బాటిళ్ల సామర్థ్యం జత కలవనున్నట్లు తెలియజేశారు.ఐపీవోకు కాంటినుమ్ గ్రీన్క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ( Continuum Green Energy IPO) పబ్లిక్ ఇష్యూకి అనుమతించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్స్ రూ. 2,400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ లిస్టింగ్ ద్వారా రూ. 3,650 కోట్లు సమీకరించనుంది. 2024 డిసెంబర్లో కంపెనీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,100 కోట్లు అనుబంధ సంస్థలు తీసుకున్న కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటి అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ తదితరాలను చేపడుతోంది. 2023–24లో కంపెనీ ఆదాయం 33 శాతం ఎగసి రూ. 1,294 కోట్లను తాకింది.
ఫ్యామిలీ

5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్
సినీ నటులు సెలబ్రిటీలను ఈ మధ్య కాలంలో తమ శరీర బరువును తగ్గించుకుంటున్నారు. పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని మార్చుకోవడం లాంటి సాహసాలతోపాటు, నిజజీవితంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, తీవ్ర కసరత్తుల ద్వారా స్లిమ్‌గా తయారవుతున్నారు. ముఖ్యంగా బాగా బరువు తగ్గి వార్తల్లో నిలిచిన వారిలో విద్యాబాలన్, ఖుష్బూ, జ్యోతిక లాంటి హీరోయిన్లు ఉన్నారు. అలాగే బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ కూడా ఇటీవలి కాలంలో బాగా బరువుతగ్గి బక్కచిక్కినట్టు కనిపించారు. అయితే కరణ్ జోహార్ ఓజెంపిక్ లాంటి ఇంజక్షన్లు తీసుకున్నారనే పుకార్లు జోరుగా వినిపించాయి. వాటిని కరణ్ తీవ్రంగా ఖండించారు. ఆహార మార్పులు, జీవన శైలి మార్పుల ద్వారానే బరువు తగ్గానని స్పష్టం చేశారు. ఇపుడు ఈ కోవలో టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. అయితే కఠినమైన డైట్‌తో తన రాబోయే చిత్రం ‘డ్రాగన్’ కోసం భారీగా బరువుగా తగ్గడం విశేషంగా నిలిచింది.అలనాటి అందాలహీరో దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లో వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ‘బాల రామాయణం’ సినిమాలో బాలనటుడిగా అద్భుతమైన నటనతో తానేంటో నిరూపించుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత రాఖీ, ఆది లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమాల్లో బొద్దుగా కనిపించి. ఉన్నట్టుంటి ఎన్టీఆర్ స్మార్ట్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అటు అభిమానులను, ఇటు విమర్శలను దిగ్భ్రాంతికి గురి చేశాడు. అప్పటినుంచి అదే బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డ్రాగన్ మూవీకోసం ఇంత బరువు అంటే..5 నెలల్లో 18 కిలోలు తగ్గాడట. ఆయన ఎలాంటి ఇంజెక్షన్లు వాడలేదని, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లుక్ కోసమే తారక్ బాగా డైటింగ్ చేశాడని అతని టీం స్పష్టం చేసింది. వ్యాయామం, కఠినమైన ఆహారం ఫలితంగా అతని లుక్‌లో మార్పు అని వెల్లడించింది. నేటి (ఏప్రిల్ 22) నుంచి ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. సముద్ర తీరంవద్ద దగ్గర జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ఉన్న అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి రేగింది. ఈ ప్రాజెక్ట్‌ను కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తుండగా, నిర్మాతలు ఇప్పటివరకు ఇతర తారాగణం సాంకేతిక సిబ్బంది వివరాలను గోప్యంగా ఉంచారు.ఓజెంపిక్ ఇంజెక్షన్లుఅయితే గతంలో బరువు తగ్గినపుడు లైపోసక్షన్ చేయించుకున్నాడనే పుకార్లు జోరుగా వినిపించాయి. తాజగా ఎన్టీఆర్ బరువు తగ్గడంపై కూడా సెలబ్రిటీలు ఎక్కువగా వాడుతున్న ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకున్నాడని వదంతులు వ్యాపించాయి. అయితే తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, తిండి మానేస్తే చాలు ఎవరైనా వెయిట్ తగ్గొచ్చు అని గతంలోనే స్పష్టం చేశాడు. అయితే తన పాత్ర కోసం బాడీని మార్చుకోవడం ఎ న్టీఆర్‌కు కొత్తేమీ కాదంటున్నారు అభిమానులు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీలోని కొమరం భీమ్ పాత్ర కోసం సెలబ్రిటీ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌తో కలిసి, ఐదు నెలల్లో 18 కిలోలు బరువు తగ్గిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రోజుకు మూడు గంటలు వ్యాయామం, కార్డియో, వెయిట్ ట్రైనింగ్, హై-ప్రోటీన్, జీరో-ఫ్యాట్ డైట్ ఇందులో భాగం.

బెట్టింగ్ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ వైరల్
బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం ఎంత సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే.బెట్టింగ్ యాప్స్ మోజులో అనేకమంది యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు సజ్జనార్. ఈ పోరు భాగంగానే తాజాగా ‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు అంటూ ఒక చక్కటి గీతాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.మన్మథుడు సినిమాలోని ‘వద్దురా.. పెళ్లొద్దురా ’ అనే సాంగ్ తరహాలో వద్దురా.. సోదరా.. బెట్టింగ్ జోలికి పోవద్దురా అంటూ ఇద్దరు గాయనీ మణులు ఒక పేరడీ సాంగ్‌ను పాడారు. దీన్ని సజ్జనార్ ట్వీట్ చేశారు.‘‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి. #SayNoToBettingApps @Cyberdost… pic.twitter.com/9DU8NNpCkv— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 22, 2025 ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. బెట్టింగ్ యాప్స్ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి’’ అంటూ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడిన అనేక ఘటనలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలకలం రేపాయి.

మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్‌లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్‌లోని దోహాలోని ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్ అని కూడా తెలిపారు. ఖతార్‌లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్‌లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో, పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా దోహాపై ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని, త్వరలోనే పిల్లల్నీ,ఫ్యామిలీని అక్కడికి తీసుకెళతానని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్ తన భార్య, సినీ నటి కరీనాకపూర్‌తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్, కరీనా జంటకు స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్ ఎస్ క్లాస్‌కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వింటికి సైఫ్ కార్లు. పర్ఫ్యూమ్స్, ఫుట్‌వేర్, హోమ్ డెకార్ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు.

క్రేజీ.. కరెన్సీ నెంబర్లు : ఫ్యాన్సీ కరెన్సీ నంబర్ల గురించి తెలుసా?
చార్మినార్ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల మాదిరిగానే.. కరెన్సీ నోట్ల ఫ్యాన్సీ నెంబర్లకూ ప్రజల్లో క్రేజ్ ఉంది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్సీ నెంబర్లకు గణనీయమైన ఆఫర్లు.. రేట్లు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటికి ఖరీదు ఎక్కువ. పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూఘర్‌లో అంతర్జాతీయ పురాతన నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. పది లక్షల నోట్లలో ఒకటి, రెండు ఫ్యాన్సీ నోట్లు ఉంటాయని.. ఇవి అరుదుగా లభిస్తుండడంతో మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 000786, 786786 నెంబర్లతో పాటు 444444, 666666 నెంబర్లకు భారీ డిమాండ్ ఉందన్నారు. వీటి ఖరీదు వేలల్లో ఉందని, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకూ కొనసాగనుందని తెలిపారు. తమ వద్ద పురాతన నాణేలు, కరెన్సీని ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చని.. అదే విధంగా ఖరీదు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. నోరూరించే.. మ్యాడ్ ఓవర్ డోనట్స్ డోనట్స్ ప్రియులకు 24 రకాల ఎగ్‌లెస్ డోనట్స్ అందుబాటులోకి వచ్చాయి. సోమవారం కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో మ్యాడ్ ఓవర్ డోనట్స్ స్టోర్‌ను ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, సీఈఓ తారక్ భట్టాచార్య ప్రారంభించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డోనట్లలో మ్యాడ్ ఓవర్ డోనట్స్ (ఎంఓడీ) ఒకటి. బబుల్టీ, బ్రైనీలు, బైట్స్‌తో పాటు చేతితో తయారు చేసిన 24 రకాల ఎగ్‌లెస్ డోనట్లను రుచి చూడవచ్చు. పుట్టిన రోజులు, ప్రమోషన్లు, స్నేహితుల కలయికకు ఎంఓడీ వేదిక కానుంది. సర్కిల్ ఆఫ్ హ్యాపీనెస్లో చేరడానికి ఆహ్వానిస్తున్నట్లు తారక్ భట్టాచార్య ప్రకటించారు.
ఫొటోలు


SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)


పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)


పెద్దమ్మ తల్లి గుడిలో బుల్లితెర జంట దావత్.. ఎందుకంటే? (ఫోటోలు)


హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న విష్ణుప్రియ (ఫోటోలు


నెత్తురోడిన కశ్మీర్ మినీ స్విట్జర్లాండ్.. చూపు తిప్పుకోనివ్వని పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రకృతి అందాలు (ఫొటోలు)


'సోదరా' మూవీ హీరోయిన్ ఆరతి గుప్తా (ఫొటోలు)


ప్రేమలు హీరో 'జింఖానా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)


హీరోయిన్ ప్రణీత కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)


ఓ ఈవెంట్లో సందడి చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)
అంతర్జాతీయం

చైనాలో 10జీ నెట్వర్క్..!
బీజింగ్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో డ్రాగన్ దేశం చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా 10 గిగాబైట్స్ ఫర్ సెకన్స్() వేగంతో పనిచేసే 10జీ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. రాజధాని బీజింగ్ సమీపంలోని హుబే ప్రావిన్స్‌లో చేపట్టిన ప్రయోగ పరీక్షలో గరిష్టంగా 10 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు మీడియా వెల్లడించింది. ఈ వేగంతో అత్యంత స్పష్టతతో కూడిన రెండు పూర్తి సినిమాలను కేవలం సెకన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ తదితర రంగాల్లో దీనితో ఎన్నో మార్పులు సంభవించనున్నాయి.

పోప్ అస్తమయం
వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. 88 ఏళ్ల ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ‘‘పోప్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. అది గుండె వైఫల్యానికి దారి తీసింది’’ అని వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘తన జీవితమంతటినీ చర్చి, ప్రభువు సేవకే అంకితం చేసిన రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ ఈ ఉదయం 7.35కు తండ్రి సన్నిధి చేరారు’ అంటూ వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారిక ప్రకటన చదివి వినిపించారు. ఆ వెంటనే రోమ్ అంతటా చర్చి టవర్లలో సంతాప సూచకంగా గంటలు మోగాయి. పోప్ పార్థివ దేహాన్ని తొలుత వాటికన్ మత పెద్దలు, అధికారుల సందర్శన నిమిత్తం శాంతా మార్తా చాపెల్‌లో ఉంచుతారు. అనంతరం సాధారణ ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ చర్చికి తరలిస్తారు. విశ్వాసులు, దేశ విదేశీ ప్రముఖులు ఆయనకు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు తుది నివాళులు అరి్పస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు త్వరలో తేదీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు వాటికన్లో సంతాప దినాలు పాటించాక పోప్ వారసుని ఎన్నిక జరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పోప్ ఇటీవలే 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిమోనియాతో 1950ల్లోనే ఆయన కుడి ఊపిరితిత్తిని తొలగించాల్సి వచ్చింది. పోప్ చివరిసారిగా ఈస్టర్ సందర్భంగా ఆదివారం బయటి ప్రపంచానికి కన్పించారు.భారతీయులపై పోప్ ప్రేమాభిమానాలు మరవలేనివి: మోదీ న్యూఢిల్లీ: పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ‘‘ప్రేమాభిమానాలకు, సహానుభూతికి మారుపేరుగా ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారు. యువప్రాయం నుంచే ఫ్రాన్సిస్ క్రీస్తు సేవకు అంకితమయ్యారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. బాధల్లో ఉన్న కోట్లాదిమందిలో ఆశాదీపం వెలిగించారు. ఆజన్మాంతం ఫ్రాన్సిస్ ప్రదర్శించిన ఆధ్యాతి్మక స్థైర్యం అందరికీ ఆదర్శం. ముఖ్యంగా భారతీయుల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపారు. ఆయనతో భేటీ అయిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను’’ అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా పలు చర్చిల ప్రతినిధులు తదితరులు పోప్ అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాపం పాటించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.సంతాపాల వెల్లువ పోప్ అస్తమయం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఇది తమనెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని కియర్ స్టార్మర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సలా వాండెర్ లెయన్, స్పెయిన్ ప్రదాని పెడ్రో శాంచెజ్, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, డెన్మార్క్ ప్రధాని డిక్ స్కూఫ్, ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిల్ రషీల్ అల్ మక్తూమ్ తదితరులు సంతాప సందేశాలు విడుదల చేశారు. భావి తరాలకు ఫ్రాన్సిస్ గొప్ప ఆదర్శంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారమే పోప్‌తో భేటీ అవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుర్తు చేసుకున్నారు.సంస్కరణవాదిగా చెరగని ముద్ర అది 2013. పోప్ బెనెడిక్ట్–16 తన పదవికి రాజీనామా చేసి రిటైరయ్యారు. అలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అలాంటి అనూహ్య పరిస్థితుల నడుమ 266వ పోప్‌గా ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్‌గా, తొలి జెస్యూట్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన అసలు పేరు జార్గ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జని్మంచారు. ఐదుగురు సంతానంలో అందరికంటే పెద్దవాడు. దైవసేవే తన మార్గమని 17 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నారు. 36 ఏళ్లకే అర్జెంటీనాలోని జెస్యూట్లకు సారథి అయ్యారు. 1992లో బ్యూనస్ ఎయిర్స్ సహాయ బిషప్, 1998లో ఆర్చి బిషప్ అయ్యారు. 2001లో కార్డినల్ అయ్యారు. అనంతరం పోప్‌గా 12 ఏళ్లకు పైగా తన పనితీరుతో చెరిగిపోని ముద్ర వేశారు. అతి నిరాడంబర జీవన శైలితో ఆకట్టుకున్నారు. మిగతా పోప్ల్లా రాజప్రాసాదంలో కాకుండా వాటికన్లోని ఓ హోటల్లో నివసించారు. 2023 దాకా బెనెడిక్ట్, ఫ్రాన్సిస్ రూపంలో వాటికన్లో ఏకకాలంలో ఇద్దరు పోప్లు ఉండటం ఓ అసాధారణ ఘటనగా నిలిచిపోయింది. అయితే బెనెడిక్ట్ అబార్షన్ వ్యతిరేక అజెండాను ఫ్రాన్సిస్ పూర్తిగా సమర్థించలేదు. అధికార బలమున్న వాళ్లు నిస్సహాయులను పీల్చుకు తినడం ఎంతమాత్రమూ సరికాదంటూ తరచూ సామ్యవాద తరహా భావనలు వెలిబుచ్చేవారు. ఎన్నో సంచలనాలు శరణార్థులు, అణగారిన వర్గాలతో పాటు స్వలింగ సంపర్కల పట్ల ఫ్రాన్సిస్ ఎంతో సహానుభూతి చూపారు. వారితో పాటు పేదలు, ఖైదీలు, అంటరాని వర్గాలకు చర్చి వ్యవస్థ పెద్ద దిక్కుగా నిలవాలని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని బాహాటంగా ప్రకటించారు. అంతేగాక, ‘ఈ అంశంపై తీర్పు చెప్పేందుకు నేనెవరిని?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలను చర్చి ఆశీర్వదించడానికి అనుమతించారు. స్వలింగ సంపర్కులు ప్రీస్ట్ బాధ్యతలు స్వీకరించడాన్ని సమర్థించారు. దీన్ని ఆఫ్రికా, ఆసియా, ఇతర ప్రాంతాల బిషప్‌లు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. సంప్రదాయవాదుల తీరుతెన్నులను సందర్భం దొరికనప్పుడల్లా గట్టిగా ఆక్షేపించారు. ఇరాక్ పర్యటన ఇరాక్‌లో పర్యటించిన తొలి పోప్‌గా ఫ్రాన్సిస్ నిలిచారు. అరబ్ దేశాల్లోనూ పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. వాటికన్ బ్యూరోక్రసీతో పాటు మొత్తంగా చర్చి వ్యవస్థనే సంస్కరించేందుకు ప్రయతి్నంచి సంచలనం సృష్టించారు. మరణశిక్షను పూర్తిగా వ్యతిరేకించేలా, అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చి వైఖరిలో మార్పులు తెచ్చారు. పోప్‌ను ఎంపిక చేసే కీలక కార్డినల్ పదవుల్లో పాస్టర్లకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్డినల్స్పై క్రిమినల్ కేసుల విచారణకు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. వాటికన్ కార్యాలయాలపై పోలీసు దాడు లకూ అనుమతులిచ్చారు! వాటికన్ అధికారుల అపరిమిత ఆర్థికాధికారాలకు కత్తెర వేశారు. వారందుకునే కానుకలపైనా పరిమితి విధించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఫ్రాన్సిస్ పనితీరుపై కొన్ని వివాదాలూ తలెత్తకపోలేదు. మైనర్లపై లైంగిక వేధింపుల అభియోగాలున్న కార్డినల్ థియోడర్ మెక్కారిక్కు చాలాకాలం పాటు దన్నుగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చి దాడి చేసిన ఘటనలో యువతి ప్రాణం కోల్పోయింది. నేషనల్ జూ పార్క్ నుంచి తప్పించుకు వచ్చిన ఆ సింహం.. జనావాసాల్లోకి వచ్చింది. అయితే దీన్ని గమనించని ఇద్దరు యువతులు వస్తున్న సమయంలో సింహం అమాంతం దాడి చేసింది. ఇందులో ఒక యువతిపై పంజా విసిరి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. చివరకు యువతి మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నారు. ఆమె వెనుక భాగంలో తీవ్ర గాయాల పాలైన ఆ యువతి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జనావాసాలు ఉండే ప్రాంతానికి నైరోబీ నేషనల్ పార్క్ కేవలం 10 కి.మీ దూరంలోనే ఉంది. అక్కడ నుంచి తప్పించుకుని ఉంటుందని భావిస్తున్న సింహం.. ఇలా దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. ఆ నేషనల్ పార్క్ అనేది క్రూర మృగాలకు ఆవాసం. సింహాలు, పులులు, చిరుత పులులు తదితర జంతువులు ఉంటాయి.

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయం

ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఉరి, పుల్వామాలలో జరిగిన దాడుల కంటే.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam)లో తాజాగా జరిగిన ఉగ్ర దాడి అత్యంత ఘోరమైందని, అది తనను ఎంతగానో బాధించిందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న ఆయన.. ఘటనకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.‘‘పహల్గాంలో.. మతం ఏంటని అడిగిన తర్వాతే ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఇది గతంలో జరిగిన ఉరి, పుల్వామా ఉగ్రదాడుల కంటే ఘోరమైంది. ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. ఇది కచ్చితంగా నిఘా వ్యవస్థ వైఫల్యమే. జమ్ములో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరోధక విధానం పనిచేస్తుందో లేదో పరిశీలించుకోవాలి. ఈ ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆశిస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారాయన.దక్షిణ జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఘోరం జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. మైదానంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న పర్యాటకులను చుట్టుముట్టి తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. ఐడీ కార్డులను పరిశీలించి.. పేరు, మతం ఆధారంగా వేరు చేసి మరీ దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడి మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరు తాజాగా మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. అయితే.. బాడీ కేమ్ ద్వారా దాడి దృశ్యాలను పాక్‌లోని తమ హ్యాండర్లకు ఉగ్రవాదులు చేరవేసినట్లు భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఫొటోలు, ఊహా చిత్రాలు విడుదల చేసి.. జమ్ము వ్యాప్తంగా గాలింపు కొనసాగిస్తోంది.

ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్న అమిత్ షా.. పుష్పగుచ్ఛం సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయనొక పోస్ట్ ఉంచారు.భారమైన హృదయంతో పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం. బాధితుల ఆవేదనను ప్రతీ భారతీయుడు అనుభవిస్తున్నాడు అని ట్వీట్ చేశారాయన.With a heavy heart, paid last respects to the deceased of the Pahalgam terror attack. Bharat will not bend to terror. The culprits of this dastardly terror attack will not be spared. pic.twitter.com/bFxb2nDT4H— Amit Shah (@AmitShah) April 23, 2025పహల్గాం ఉగ్రదాడి సమాచారం అందుకున్న వెంటనే మంగళవారమే అమిత్ షా జమ్ము కశ్మీర్ చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతులకు నివాళులర్పించిన అనంతరం.. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలు కన్నీళ్లతో షాను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఘటన వెనక ఉన్నవారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలతో అమిత్ షా స్పష్టం చేశారు. ఆపై కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన.. అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.#WATCH | Union Home Minister Amit Shah meets the families of the victims of the Pahalgam terrorist attack in Srinagar, J&K pic.twitter.com/z7XvMMcadE— ANI (@ANI) April 23, 2025 #WATCH | Srinagar | Union Home Minister Amit Shah and J&K LG Manoj Sinha meet the families of Pahalgam terror attack victims pic.twitter.com/vJ73eeRyVC— ANI (@ANI) April 23, 2025

పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్ ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. పైగా ల్యూలియన్ సరస్సుకు బైసరన్ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్ ఫైర్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్ మీడియాలో బైసరన్ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025

యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్‌చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు.

యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.

హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
వీడియోలు


Pahalgam Terror Attack: తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయంలో క్యాండిల్ ర్యాలీ


KTR: తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్..


వినయ్ మృతదేహం వద్ద బోరున విలపించిన భార్య హిమాన్షి


ఉగ్రదాడికి ప్రతీకారం.. భారత్ భారీ ఆపరేషన్


Asaduddin Owaisi: పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రమూకకు గుణపాఠం చెప్పాలి


నారా లోకేష్ బినామీలు, ఫేక్ కంపెనీలు సృష్టించి భూములు కొట్టేస్తున్నారు


Margani Bharat: కూటమి పాలనలో స్కీమ్ లు కాదు.. స్కామ్‌లు పెరిగాయి


రఘురామ కృష్ణంరాజు పై సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు


Pahalgam Attack: ఎవరీ సైఫుల్లా కసూరి?


Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ రియాక్షన్