
కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: మండల పరిధిలోని కరేడు గ్రామానికి చెందిన కబడ్డీ కోచ్ సాదం శ్రీనివాసరావు నేషనల్ రెఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గురువారం తెలిపారు. బిహార్‌లోని బుద్ధగయలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న సబ్ జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఆంధ్రప్రదేశ్ రెఫరీ బోర్డు నుంచి శ్రీనివాసరావును ఎంపిక చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు సహ కరించిన వ్యాయామ అధ్యాపకులు, బోర్డు కన్వీనర్ రవీంద్రబాబు, అసోసియేషన్‌కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.
నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది
● సినీ నటుడు తనికెళ్ల భరణి
సంగం: నెల్లూరు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి తెలిపారు. అసుర సంహారం అనే సినిమా షూటింగ్ గురువారం మండలంలో జరిగింది. పలు సన్నివేశాలను తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్‌కుమార్ నివాసంలో, సంగమేశ్వరాలయంలో చిత్రీకరించారు. తనికెళ్ల భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో 40 ఏళ్ల క్రితం నాటికను ప్రదర్శించానన్నారు. ఇక్కడ అమరావతి కృష్ణారెడ్డి, నందు, హరివిల్లు ఆర్గనైజేషన్ నిర్వాహకులు, పలువురు మిత్రులున్నారని తెలిపారు. నెల్లూరుకు చెందిన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తాను పలు సినిమాల్లో నటించామన్నారు. ప్రతిభ ఉన్నవారిని సినిమా ఇండస్ట్రి ఎప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నారు.
కండలేరులో 49.983 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 49.983 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment