నిర్లక్ష్యం వహిస్తే క్షయ.. క్షోభే
ఆరోగ్యం బేజారయ్యే అవకాశం శారీరకంగా, ఆర్థికంగా కుంగుబాటు
నెల్లూరు(అర్బన్): క్షయతో ఆరోగ్యం గుల్లవుతుంది. చాపకింద నీరులా జిల్లాలో ఇది వ్యాపిస్తుండటం కలవరానికి గురిచేస్తోంది. తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు పక్కవారిపై పడితే అందులోని సూక్ష్మజీవుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా ఇది రావొచ్చు. జిల్లాలో 16 వేల మంది వరకు రోగులున్నారని ఐఎంఏ లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల ద్వారా గుర్తించిన కేసులే వైద్యశాఖ రికార్డుల్లో ఉంటున్నాయి. అదే ప్రైవేట్ హాస్పిటళ్లలో గుర్తించే కేసుల వివరాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. వ్యాధి విషయాన్ని తెలియకుండా చూడాలని పలువురు రోగులు కోరుతుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. వ్యాధి బారినపడి ఏటా 80 నుంచి 100 మంది వరకు మృత్యువాత పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే మొదటికి
టీబీ సోకిన వారు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు మందులను వినియోగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధి తగ్గుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. కొంతకాలం మందులు వాడి ఆపేసినా మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. తదుపరి టీబీ ముదిరి, ఏడాది నుంచి రెండేళ్ల పాటు మందులను వాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అధికారిక లెక్కల మేరకు ప్రస్తుతం 24 మందికి ఇలా మారిందని సమాచారం. ఐదేళ్లలోపు పిల్లలకు సోకితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
రోగులకు భరోసాగా..
టీబీ సోకిన వారికి జిల్లా టీబీ నివారణ శాఖ ఆధ్వర్యంలో ఖరీదైన మందులను ప్రతి నెలా క్రమం తప్పకుండా అందజేయడంతో పాటు మింగిస్తున్నారు. వ్యాధికి గురైన వారు పనులకు దూరంగా ఉండాల్సిన తరుణంలో పౌష్టికాహారం కోసం రూ.వెయ్యిని వారి ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. రోగిని ప్రైవేట్ డాక్టర్లు గుర్తించి సమాచారమందిస్తే సదరు వైద్యుడికి ప్రోత్సాహకంగా రూ.500ను అందజేస్తున్నారు. చికిత్స పూర్తయ్యాక మరో రూ.500, డాట్ పద్ధతిన రోగితో మందులు మింగించినందుకు ఆరోగ్య కార్యకర్తలకూ ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు.
చికిత్స పొందుతున్న రోగులు
టీబీ
యూనిట్లు
13
గళ్ల పరీక్ష కేంద్రాలు
92
ఇవీ లక్షణాలు..
రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం రావడం, గళ్ల పడటం, అందులో రక్తపు ఛారలుండటం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలుంటే టీబీగా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. మెడ, గొంతు, చెంపపై చెవి కింద, చర్మంలోపల గడ్డలుంటే వ్యాధిగా అనుమానించాలి. ఇంట్లో ఎవరికై నా వస్తే, మరొకరికి సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.
వ్యాధికి ప్రధాన కారణాలు..
టీబీని మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌కులోసిస్ అనే సూక్ష్మజీవి కలిగిస్తోంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడేవారు, పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉండే వారు, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే స్టెరాయిడ్స్‌ను వినియోగించే వారికి ఇది సోకుతోంది. ఊపిరితిత్తులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. మద్యం, ధూమపానం అలావాటుండే వారు, షుగర్ వ్యాధిగ్రస్తులకు త్వరగా వచ్చే అవకాశం ఉంది.
సీబీనాట్ / జీన్ ఎక్స్‌పర్ట్ కేంద్రం 1
ప్రపంచ టీబీ నివారణ
దినోత్సవం నేడు
జిల్లాలో గతంలో తగ్గుముఖం పట్టిన క్షయ (టీబీ) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆహార లోపంతో బాధపడేవారు, మురికివాడల్లో ఉండే పేదలకు ఈ వ్యాధి వేగంగా సోకుతోంది. ఓ వ్యక్తి నుంచి మరొకరికి అంటువ్యాధిగానూ వ్యాపిస్తోంది. దీని బారినపడిన వారికి రోజూ బలవర్థకమైన ఆహారాన్ని అందించాల్సి ఉండటంతో ఆ కుటుంబంపై ఆర్థిక భారమూ పడుతోంది. ఖరీదైన మందులను ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు క్రమం తప్పకుండా వినియోగించాలి. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, అది ప్రాణాంతకమయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఈ ఏడాది
జనవరి, ఫిబ్రవరిలో
జరిపినవి
13,550
2024లో
నిర్వహించిన పరీక్షలు
83,381
పెరుగుతున్న కేసులు
జిల్లాలో సుమారు
16 వేల మంది రోగులు
ఏటా 80 నుంచి 100 మంది మృతి
నాణ్యమైన వైద్యసేవలు
టీబీని నివారించడమే లక్ష్యంగా నాణ్యమైన సేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఖరీదైన మందులను ఇంటి వద్దే రోగికి అందేలా చూస్తున్నాం. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం.
– ఖాదర్‌వలీ, జిల్లా టీబీ
నియంత్రణాధికారి
జాగ్రత్తలు తప్పనిసరి
టీబీపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. నాట్ వంటి కొత్త పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ప్రైవేల్ ఆస్పత్రుల్లో కఫం పరీక్షలు చేస్తున్నారు. వ్యాధిగా నిర్ధారణైతే జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడితే నయం చేయొచ్చు.
– గౌరీనాథ్, పల్మనాలజిస్ట్,
ఎనెల్ స్పెషాల్టీ ఆస్పత్రి, నెల్లూరు
నిర్లక్ష్యం వహిస్తే క్షయ.. క్షోభే
నిర్లక్ష్యం వహిస్తే క్షయ.. క్షోభే
నిర్లక్ష్యం వహిస్తే క్షయ.. క్షోభే
నిర్లక్ష్యం వహిస్తే క్షయ.. క్షోభే
Comments
Please login to add a commentAdd a comment