
ఈద్‌ను సంతోషంగా జరుపుకోవాలి
నెల్లూరు(బృందావనం): మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాక్షించారు.
ఒకేరోజు 96 రిజిస్ట్రేషన్లు
నెల్లూరు సిటీ: ఆదివారం సెలవు దినమైనా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జరిగాయి. ఒకేరోజులో 96 రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. రూ.19,65,336 రాబడి వచ్చినట్లు వెల్లడించారు. సోమవారం రంజాన్ పండగా అయినా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు.
కండలేరులో
48.794 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 48.794 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,320, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
మిద్దైపె వాకింగ్
చేస్తుండగా..
● ప్రమాదవశాత్తు కింద పడి
మహిళ మృతి
నెల్లూరు(క్రైమ్): ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి కిందపడి ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎన్జీఓ కాలనీకి చెందిన జ్యోతి (49), పురుషోత్తం దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. జ్యోతి వారంరోజుల క్రితం అయ్యప్పగుడి సమీపంలో నివాసముంటున్న తన తల్లి సరస్వతమ్మ వద్దకు వెళ్లింది. శనివారం రాత్రి ఆమె వాకింగ్ చేసేందుకు మిద్దైపెకి వెళ్లింది. కొద్దిసేపటికి సరస్వతమ్మ వెళ్లి చూడగా కుమార్తె కనిపించలేదు. దీంతో ఆమె కిందకు వచ్చిచూడగా కుమార్తె తలకు తీవ్రగాయమై రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో సరస్వతమ్మ జరిగిన విషయాన్ని తన మనవడు లీలామోహన్‌కు తెలియజేసింది. అతను వెంటనే ఇంటి వద్దకు చేరుకుని తల్లిని చికిత్స నిమిత్తం జయభారత్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ల సూచన మేరకు నారాయణ హాస్పిటల్‌కు తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుమారుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కోడిపందేల స్థావరంపై దాడి
నెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలో కోడిపందేల స్థావరంపై రూరల్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. వారి కథనం మేరకు.. నారాయణరెడ్డిపేటలోని ఖాళీ స్థలంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.11,250 నగదును స్వాధీనం చేసుకున్నారు.