● తప్పిన ఘోర ప్రమాదం
సంగం: పెట్రోల్ బంకులోకి లారీ దూసుకెళ్లిన ఘటన సంగం కొండ కూడలి వద్ద గల జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కొండ పైనుంచి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు నుజ్జునుజ్జయ్యాయి. వరికోత యంత్రాలు, బంకు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నాయి. పెను ప్రమాదం తప్పడంతో పలువురు ఊపిరిపీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని వివరాలను పోలీసులు సేకరించారు. సుమారు రూ.మూడు లక్షల మేర నష్టం వాటిల్లింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొనడంతో
వాహనచోదకుడి దుర్మరణం
వెంకటాచలం: కారు ఢీకొనడంతో వాహనచోదకుడు మృతి చెందిన ఘటన మండలంలోని గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన లారీ


