3537 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నెల్లూరు రూరల్: జిల్లాలో 3537 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మంగళవారం కొనుగోలు చేశామని జేసీ కార్తీక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.43.3 కోట్లను జమ చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
నెల్లూరు రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాన్ని మంత్రి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఐదు లక్షల గోతాలున్నాయని చెప్పారు. దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని కోరారు. ధాన్యం కొనుగోలు విషయమై జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు. మిల్లు వద్ద రెవెన్యూ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టామని, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమవుతుందని తెలిపారు. అవసరమైతే ప్రకాశం, బాపట్ల, కందుకూరు తదితర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీచైతన్య
పాఠశాలకు తాళాలు
● జీఎస్టీ వివాదంలో భవన యజమాని చర్య
● స్కూల్‌మూతతో
వెనుదిరిగిన విద్యార్థులు
కోవూరు: పట్టణంలోని శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు భవన యజమాని బుధవారం తాళాలేశారు. యజమాని వినీత్‌రెడ్డికి చెల్లిస్తున్న అద్దెకు సంబంధించిన 18 శాతం జీఎస్టీని పాఠశాల యాజమాన్యం జమచేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే దీన్ని చెల్లించకపోవడంతో వడ్డీ, జరిమానాతో కలిసి ఇది రూ.36.83 లక్షలకు చేరింది. ఈ తరుణంలో జీఎస్టీ, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, నెల్లూరు నుంచి యజమానికి నోటీస్ జారీ అయింది. దీనిపై పలుమార్లు కోరినా స్పందించలేదని, దీంతో తాళాలేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కాగా ఈ పరిణామంతో విద్యార్థులు వెనుదిరిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రంగనాథ్‌గౌడ్ పాఠశాల వద్దకు చేరుకొని సిబ్బందిని విచారించారు.
పది పరీక్షలకు
309 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన హిందీ టెస్ట్‌కు జిల్లాలో 309 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. 28,485 మందికి గానూ 28,176 మంది హాజరయ్యారు. ఆరు కేంద్రాల్లో స్టేట్ అబ్జర్వర్, ఎనిమిది కేంద్రాల్లో డీఈఓ, 56 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
● ఏపీ ఓపెన్ స్కూల్ పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 392 మంది అభ్యాసకులకు గానూ 344 మంది హాజరయ్యారు.
3537 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
Comments
Please login to add a commentAdd a comment