త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం
●ప్రముఖ గాయని ఎస్పీ శైలజ
నెల్లూరు(బృందావనం): నగరంలో నిర్వహిస్తున్న త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ గాయని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. నగరంలోని పురమందిర ప్రాంగణంలో భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన స్మరణోత్సవాలకు ఆమె హాజరయ్యారు. గాత్రకచేరి నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన గాయని చాగంటి రమ్య కిరణ్మయి, త్యాగరాజస్వామి, శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపాలను త్రీడీ కార్డు బోర్డుతో తీర్చిదిద్దిన కళాకారుడు కిడాంబి నరసింహాచార్యులును సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ, తన తండ్రి ఆప్తమిత్రుడు డాక్టర్ యనమండ్ర వెంకటేశ్వరశాస్త్రి కుటుంబసభ్యులతో కలిసి ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభించిన స్మరణోత్సవాలను కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీటిని తన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్నేళ్ల పాటు నిర్వహించారన్నారు. ఉ త్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 26న నిర్వ హించనున్న సీతారాములు, శివపార్వతుల కల్యా ణోత్సవాల్లో పాల్గొంటానన్నారు. యనమండ్ర నాగ దేవీప్రసాద్, కమిటీ సభ్యులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment