సోమశిల ఈఈ బాధ్యతల స్వీకరణ
సోమశిల: సోమశిల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా శ్రీనివాస్‌కుమార్ బాధ్యతలను బుధవారం చేపట్టారు. ఆయన్ను డీఈఈ రవీంద్రప్రసాద్, జేఈలు గురుప్రసాద్, పెద్దిరాజు, నిఖిల్, శరత్‌చంద్ర, రామ్మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను తెలియజేశారు.
రొయ్యల ఫ్యాక్టరీలో తనిఖీలు
కొడవలూరు : మండలంలోని పెయ్యలపాళెం రోడ్డులో గల అల్ఫా మైరెన్ రొయ్యల ఫ్యాక్టరీలో బాల కార్మికులతో పని చేయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలను అధికారులు బుధవారం నిర్వహించారు. కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి, వైద్యాధికారి బాలచంద్రబాబు, కార్మిక శాఖ, సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు తనిఖీలను జరిపారు. 18 ఏళ్లలోపు వయస్సున్నట్లు అనుమానం ఉన్న పలువుర్ని గుర్తించారు. వయస్సు నిర్ధారణ నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. 18 ఏళ్లలోపు ఉందని నిర్ధారణ అయితే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
సోమశిల ఈఈ బాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment