కారుణ్య నియామక పత్రాల అందజేత
నెల్లూరు(అర్బన్): ఐదుగురికి కారుణ్య నియామకాల కింద కలెక్టర్ ఆనంద్ ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్‌లు లబ్ధిదారులకు అందించారు. సీహెచ్ రాము హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మృతిచెందగా అతడి కుమారుడు భార్గవ్‌కు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా, కె.జోసఫ్ ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోగా అతని కుమారుడు కుష్వంత్ కల్యాణ్‌కుమార్‌కు పంచాయతీరాజ్ సర్కిల్లో సబార్డినేట్‌గా, గురవయ్య ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు గురుకిషోర్‌కు పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా, పి.ఆదినారాయణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోగా అతడి కుమారుడు నవీన్‌కుమార్‌కు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో గ్రేడ్–2 వీఆర్వోగా, యు.శ్రీనివాసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు సాయిని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ సందర్భంగా డీఆర్వో ఉదయభాస్కర్‌రావు మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన వారు సర్వీస్‌లో మంచి పేరు తెచ్చు కోవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment