వీఎస్‌యూలో అంతర్జాతీయ సదస్సు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో బ్లూ రెవల్యూషన్ ఇన్నోవేషన్స్ ఇన్ మైరెన్ సిస్టమ్స్ (బీఆర్‌ఐఎంఎస్ – 2025) అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్లూ ఎకానమీ అభివృద్ధికి దోహదం చేసే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సముద్ర పరిశోధన, మత్స్య పరిశ్రమ, బ్లూ ఎకానమీ అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరమని తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్ ఇన్ బ్లూ ఎకానమీ, ఎక్స్‌పర్టైజ్ ఫ్రాన్స్ ప్రొఫెసర్ మానెల్ జఖారియా, ఎన్‌ఐఓటీ సభ్యుడు డాక్టర్ ఎన్‌వీ వినీత్‌కుమార్ తదితరులు సముద్ర సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా బ్లూ ఎకానమీ అభివృద్ధికి కొత్త అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment