
డాక్టర్ శ్రావణికి ప్రతిష్టాత్మక అవకాశం
వెంకటాచలం: వీఎస్‌యూ పూర్వవిద్యార్థి ని డాక్టర్ బతినపట్ల శ్రావణి ప్రతిష్టాత్మక 74వ లిండౌ నోబెల్ లారియట్ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కడంతో వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. శ్రావణి వీఎస్‌యూలో ఎంఎస్‌సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసి కడపలోని యోగివేమన వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంకే పోస్ట్– డాక్టోరల్ ఫెలోగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 4 తేదీ వరకు జర్మనీలోని లిండౌ నగరంలో జరగనున్న 74వ లిండౌ నోబెల్ లారియట్ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే 600 మంది యువ శాస్త్రవేత్తల్లో ఒకరిగా డాక్టర్ శ్రావణి ఎంపికై ంది.