
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
నెల్లూరు రూరల్: జిల్లాలోని 95 వేలకుపైగా ఉన్న నోషనల్ ఖాతాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శుక్రవారం నుంచి నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జేసీ కార్తీక్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 1,84,298 సర్వే నంబర్లలో 95,060 నోషనల్ ఖాతాలున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అసైన్‌మెంట్ భూములు, రిజిస్టర్ భూములు, చుక్కల భూములు, పౌతి (మరణించిన వారి సంబంధించిన) సాదాబైనామా సంబంధించిన ఖాతాలను పరిశీలించి రెగ్యులర్ చేస్తామన్నారు. 2,37,000 మంది రైతుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలిరోజు పైలట్ ప్రాజెక్ట్‌గా ఎనిమిది మండలాల నేషనల్ ఖాతాలను పరిశీలిస్తామన్నారు.