మలేరియాతో ఆరోగ్యానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

మలేరియాతో ఆరోగ్యానికి ముప్పు

Published Fri, Apr 25 2025 12:13 AM | Last Updated on Fri, Apr 25 2025 12:13 AM

మలేరి

మలేరియాతో ఆరోగ్యానికి ముప్పు

నెల్లూరు(అర్బన్‌): దోమ కాటు వల్ల వచ్చే మలేరియా అనే జబ్బుతో ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. చలి, వణుకుతో కూడిన జ్వరం రావడమే కాకుండా కొన్ని సందర్భాల్లో మెదడుకి పాకి ప్రాణాంతకంగా మారుతోంది. దీంతో రోగి వైద్యానికి ఒక్కో దఫా రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్‌ 25వ తేదీన అన్ని దేశాల్లో జరుపుకోవాలని పిలుపునిచ్చింది. మలేరియా అంతం మనతోనే అనే థీమ్‌ను ఈ సంవత్సరం ప్రకటించింది. శుక్రవారం జిల్లాలో వైద్యులు, వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు.

జిల్లాలో వందలాది కేసులు

కొన్ని సంవత్సరాల నుంచి మలేరియా కేసులు తగ్గాయి. అయినా వందలాదిగా కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. ప్రధానంగా రాపూరు, సీతారామపురం తదితర ప్రాంతాల్లో గతంలో ఎక్కువగా వచ్చాయి. నెల్లూరు నగరంలోనూ మలేరియా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. వైద్యశాఖలో పరిశీలిస్తే జిల్లాలో మలేరియా కేసులు దాదాపు లేవనేది అధికారుల మాట. అయితే ఉదాహరణకు నెల్లూరు విజయమహల్‌ గేట్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరిశీలిస్తే గణాంకాల్లో తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కచోటే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లెక్కలు తీస్తే వందలాది కేసులుంటాయి. అయితే వైద్యశాఖ మాత్రం జిల్లా అంతటా కలిపి రెండో, మూడోగా నిర్ధారణ చేయడం దారుణమనే వాదన ఉంది.

చాలా డేంజర్‌

ప్లాస్మోడియం వైవాక్స్‌ కన్నా ప్లాస్మోడియం ఫాల్సీపరం అనే పరాన్న జీవి ద్వారా వచ్చే మలేరియా డేంజర్‌. ఒక్కోదఫా మెదడుకు కూడా వ్యాపించి మనిషి మరణించిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. రక్తపరీక్షలో వైవాక్స్‌ మలేరియా అయితే రెండు వారాలు పూర్తిగా చికిత్స తీసుకోవాలి. ఫాల్సీఫారం మలేరియా అయితే 3 రోజులు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ చికిత్సను ఉచితంగా పొందవచ్చు. మలేరియా రాకుండా ఉండాలంటే దోమలు పుట్టకుండా.. కనీసం కుట్టకుండా చూసుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

సకాలంలో చికిత్స తప్పనిసరి

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం

డ్రైడేను పాటించాలి

ఇంటి లోపల బిందెలు, తొట్టెల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వారానికి ఒకరోజును డ్రైడేగా పాటించి నీటి తొట్టెలను, పాత్రలను శుభ్రపరిచి ఎండబెట్టాలి. అలాగే ఇంటి పరిసరాల్లో ఉండే ప్లాస్టిక్‌ మూతలు, రబ్బర్‌ టైర్లు, టెంకాయ చిప్పలు లాంటి వాటిలో కూడా కొద్దిపాటి నీరు కూడా నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలి. అప్పుడు దోమల నియంత్రణ జరుగుతుంది. అలాగే దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి.

– ఈ.హుస్సేనమ్మ, జిల్లా మలేరియా నివారణాధికారిణి

మలేరియాతో ఆరోగ్యానికి ముప్పు 1
1/1

మలేరియాతో ఆరోగ్యానికి ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement