
మద్యం పాలసీపై బాబుది బూటకపు ప్రచారం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులతో తీసుకొచ్చిన మద్యం పాలసీపై చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసి, అక్టోబర్‌లో 20 డిస్టిలరీలపై దాడులు జరిపి ఎనిమిది నెలల పాటు సీఐడీ విచారణ జరిపినా ఒక్క సాక్ష్యాన్ని సైతం సంపాదించలేకపోయారని చెప్పారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌రెడ్డి వద్ద తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేసి, వాటి ఆధారంగా కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇదే వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో నాటి టీడీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో చంద్రబాబును ఏ – 3గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసును పక్కదోవ పట్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 43 వేల బెల్టుషాపులను తమ ప్రభుత్వ హయాంలో రద్దు చేశారని గుర్తుచేశారు. అప్పట్లో పారదర్శకంగా విక్రయాలు జరిగాయని, ఈ వివరాలు ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఉన్నా, ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి 20 వేల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. నూతన మద్యం పాలసీలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడటమే కాకుండా విక్రయాలను విచ్చలవిడి చేసిందని ఆరోపించారు. దీని వల్ల రాష్ట్రంలో శాంతిభద్ర తలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రేపట్నుంచి స్లాట్ బుకింగ్
నెల్లూరు సిటీ: జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ శనివారం నుంచి ప్రారంభంకానుందని జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రక్రియ ఈ నెల నాలుగున ప్రారంభమైందని, తాజాగా మిగిలిన కార్యాలయాల్లోనూ షురూ కానుందని చెప్పారు.
కొవ్వొత్తుల ర్యాలీ
నెల్లూరు( వీఆర్సీసెంటర్): కశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 27 మంది పర్యాటకులను బలి తీసుకోవడం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీని సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేతలు మూలం రమేష్, మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్, గోగుల శ్రీనివాసులు, చెంగయ్య, రెహనాబేగం, కొండా ప్రసాద్, నాగేశ్వరరావు, మస్తాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.
దౌర్జన్యాలతో కలాలకు కళ్లెం వేయలేరు
మనుబోలు: దాడులు, దౌర్జన్యాలతో జర్నలిస్టుల కలాలకు కళ్లెం వేయలేరని గూడూరు ప్రింట్ మీడియా డివిజన్ ఉపాధ్యక్షుడు బాబు మోహన్‌దాస్ పేర్కొన్నారు. ఏలూరులోని సాక్షి కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు మంగళవారం దాడికి పాల్పడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన ఘటనపై నిరసనను గురువారం వ్యక్తం చేశారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ బషీర్‌కు మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తమకు నచ్చిన విధంగా వార్తలు రాయలేదనే కారణంతో జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం రాజకీయ నేతలు, వారి అనుచరులకు పరిపాటిగా మారిందని చెప్పారు. సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా ప్రతినిధులు జగదీష్‌బాబు, సుధాకర్, శ్రీనివాసులు, బాషా, శంకర్, సాయి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మద్యం పాలసీపై బాబుది బూటకపు ప్రచారం

మద్యం పాలసీపై బాబుది బూటకపు ప్రచారం