పీహెచ్‌సీలో డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల సందర్శన
సోమశిల: అనంతసాగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమ నిపుణుడు భవానీ రామకృష్ణ గురువారం సందర్శించారు. టీబీ యూనిట్, ట్రూనాట్ ల్యాబ్‌లో పరికరాల పనితీరును పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న క్షయ పరీక్షలపై వైద్యాధికారి శ్రీకాంత్‌రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తుల రికార్డులను పరిశీలించారు. అనుమానిత రోగుల నుంచి సేకరించిన గళ్ల నమూనాలను తనిఖీ చేశారు. టీబీ వ్యాధిగ్రస్తురాలిని పరిశీలించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయనే అంశాన్ని ఆరా తీశారు. డాక్టర్ శ్రావణి, ల్యాబ్ టెక్నీషియన్ మీరాన్, హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


