మేజర్ మినరల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
నెల్లూరు (టౌన్): జిల్లాలోని మైనింగ్ లీజుదారులు మైనర్ నుంచి మేజర్ మినరల్‌కు మారేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ సీనియర్ జియాలజిస్టు కార్తికేయన్ తెలిపారు. సోమవారం స్థానిక ఆటోనగర్‌లోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో మైనింగ్ లీజుదార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్ నుంచి మేజర్‌కు మారేందుకు కావాల్సిన పత్రాలపై లీజుదార్లకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మైనింగ్ లీజుదారుల అసోసియేషన్ అధ్యక్షులు ద్వారకానాథ్‌రెడ్డి, మైనింగ్ డీడీ బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
డీసీపల్లి వేలం కేంద్రంలో
545 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో సోమవారం 545 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 565 బేళ్లు రాగా వాటిలో 545 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.274.82గా నమోదైంది. వేలంలో 71,698 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,97,04,072 వ్యాపారం జరిగింది. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకు
ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు రూరల్: జిల్లాలో జరిగే ఏపీపీఎస్‌సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్‌రావు తెలిపారు. ఈ నెల 25 నుండి 27 వరకు జరిగే పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డీఆర్‌ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌లోని ఆయాన్ డిజిటల్ సెంటర్, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, కావలిలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల, ఆర్‌ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్‌సీ ప్రతినిఽధి గిరిజారాణి, పరీక్షా కేంద్రాల కళాశాలల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాల్పుల కలకలంలో
నిందితుల అరెస్ట్
నెల్లూరు సిటీ: ఆస్తి వివాదం నేపథ్యంలో తన తండ్రి ఇంటికి వెళ్లి తండ్రి, సోదరుడిపై గన్‌తో కాల్చిన ఘటనలో నిందితులను చిన్నబజారు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానిక ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు సమాచారం మేరకు.. నగరంలోని రావూరివారివీధిలో రాజమాల్ జైన్‌కు ఆయన రెండో కుమారుడు హితేష్‌జైన్ మధ్య ఆస్తి విభేదాలున్నాయి. 22వ తేదీ అర్ధరాత్రి హితేష్ తన స్నేహితులైన గాంధీనగర్‌కు చెందిన వంశీ, మూలాపేటకు చెందిన భరత్, పొదలకూరురోడ్డుకు చెందిన రాజశేఖర్‌రెడ్డి, కోనేటిమిట్టకు చెందిన శేఖర్ సందీప్ అలియాస్ శ్రీనివాస్‌శేఖర్, కిశోర్‌తో కలిసి తండ్రి ఇంటికి వెళ్లి హితేజ్ తన వద్ద ఉన్న పిస్టోల్‌తో తలుపుపై కాల్పులు జరిపిన విషయం విదితమే. రాజమల్ జైన్ పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్ జైన్ ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి పిస్టోల్‌తోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఇన్‌స్పెక్టర్, క్రైమ్ పార్టీ ఏఎస్‌ఐ శ్రీహరి, రవిప్రసాద్, హెచ్‌సీలు సురేష్, నజ్మల్, కానిస్టేబుల్స్ శ్యామ్, సుబ్బారావు, వర్ధన్‌లను ఎస్పీ అభినందించారు.
మేజర్ మినరల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment