
సీఐఎస్‌ఎఫ్ సైకిల్ ర్యాలీ
కావలి: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బక్కాలి నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చేపట్టిన సైకిల్ యాత్ర కావలికి శనివారం చేరుకుంది. దేశంలోకి అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ కట్టడి, తీర ప్రాంత రక్షణ తదితరాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో యాత్రను ఈ నెల ఏడున ప్రారంభించారు. మొత్తం 60 మంది సభ్యులు పాలుపంచుకున్న ఈ యాత్ర కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్ వద్ద ముగియనుంది.
ఈ – కేవైసీని నూరు శాతం పూర్తి చేయాలి
నెల్లూరు (పొగతోట): రేషన్‌కార్డుదారులకు సంబంధించిన సభ్యులందరితో ఈ – కేవైసీని పూర్తి చేయించాలని డీఎస్‌ఓ అంకయ్య ఆదేశించారు. నగరంలోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో డీలర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7.21 లక్షలకుపైగా రేషన్ కార్డులకు గానూ 20 లక్షలకుపైగా సభ్యులున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 18 లక్షల మంది ఈ – కేవైసీని పూర్తి చేశారని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఉందని, ఈ నెల 31లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
బైక్‌ల ఢీ:
నలుగురికి గాయాలు
ఉదయగిరి: బైక్‌లు ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయగిరికి చెందిన చాంద్‌బాషా, మస్తాన్, కాలేషా బైక్‌పై కృష్ణంపల్లెలోని పొలం వద్దకు బయల్దేరారు. వీరి వెనుకనే బైక్‌పై వస్తున్న పట్టణానికి చెందిన మస్తాన్.. గడ్డంవారిపల్లె సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి ఢీకొన్నారు. ఘటనలో నలుగురూ గాయపడ్డారు. వీరిని 108లో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
దుత్తలూరులో
పట్టపగలే దొంగతనం
● 11 సవర్ల బంగారు ఆభరణాల
అపహరణ
దుత్తలూరు: దుత్తలూరు సెంటర్‌లో శనివారం పట్టపగలే దొంగతనం జరిగింది. వివరాలు.. సెంటర్ సమీపంలోని వెంకయ్యస్వామి మందిర పక్కన చింతనబోయిన నరేష్ నివసిస్తున్నారు. మధ్యాహ్న వేళ ఎవరూ లేని సమయంలో గేట్ తాళాన్ని పగలగొట్టి.. ప్రధాన ద్వార తలుపు, తాళాన్ని ధ్వంసం చేసి లోపలికి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి అందులోని 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇంటికొచ్చిన అనంతరం చోరీ విషయాన్ని నిర్ధారించుకున్న బాధితుడు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని ఎస్సై ఆదిలక్ష్మి పరిశీలించారు. వేలిముద్రలను క్లూస్‌టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సీఐఎస్‌ఎఫ్ సైకిల్ ర్యాలీ

సీఐఎస్‌ఎఫ్ సైకిల్ ర్యాలీ

సీఐఎస్‌ఎఫ్ సైకిల్ ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment