నెల్లూరు(బృందావనం): పురమందిర ప్రాంగణంలో త్యాగరాజ స్మరణోత్సవాలను భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహిస్తున్నారు. స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో ఆదివారం దర్శనమిచ్చారు. కేరళకు చెందిన విష్ణుదేవ్ నంబూద్రి గాత్రకచేరి వీనులవిందుగా సాగింది. 120 మందికిపైగా స్థానిక ఔత్సాహిక కళాకారులతో గాత్ర, వీణకచేరీలు మధురంగా సాగాయి. స్మరణోత్సవ సభ కమిటీ శాశ్వత కార్యదర్శి యనమండ్ర నాగదేవీప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు.
కుక్కల దాడిలో
చుక్కల దుప్పి మృతి
ఉదయగిరి: కుక్కలు దాడి చేయడంతో తాగునీటి కోసం జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన మండలంలోని మాసాయిపేటలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి చుక్కల దుప్పి రావడంతో కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు గమనించి దుప్పిని రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించగా, దుప్పి అప్పటికే మృతి చెందిందని గుర్తించారు. అనంతరం గండిపాళెం పశువైద్యశాలకు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గన్నేపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో దుప్పిని ఖననం చేశారు.
గుర్తుతెలియని
వాహనం ఢీకొనడంతో..
ముత్తుకూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ముత్తుకూరు – నెల్లూరు రోడ్డులోని తాళ్లపూడి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకొని వెళ్తుండగా, వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. మృతుడికి 50 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
పూటుగా మద్యం సేవించి.. నిద్రలోనే కన్నుమూసి
నెల్లూరు సిటీ: పూటుగా మద్యం సేవించి నిద్రలోనే వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రామచంద్రాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. రామచంద్రాపురంలో సాయి అనసూయమ్మ ఇంట్లో ఓ గదిని బాడుగకు తీసుకొని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పెద్దబ్బాయి (65) పది నెలలుగా నివాసం ఉంటున్నారు. నగరంలో కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి తన గదిలో శనివారం నిద్రించారు. ఈ తరుణంలో తలుపును యజమాని తట్టగా, తీయకపోవడంతో అనుమానం వచ్చి పగలగొట్టి చూడగా పెద్దబ్బాయి విగతజీవిగా పడి ఉన్నారు. మద్యాన్ని అధిక మొత్తంలో సేవించి అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నవాబుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 49.74 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 7800, లోలెవల్ కాలువకు 30, హైలెవల్ కాలువకు 120, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.
నిమ్మ ధరలు
పొదలకూరు (కిలో)
పెద్దవి: రూ.75
సన్నవి: రూ.55
పండ్లు: రూ.30
వీనులవిందుగా గాత్రకచేరి
వీనులవిందుగా గాత్రకచేరి
వీనులవిందుగా గాత్రకచేరి
వీనులవిందుగా గాత్రకచేరి
వీనులవిందుగా గాత్రకచేరి