ఖోఖోలో చిచ్చర పిడుగులు
● కష్టాలను అధిగమించి.. రాణిస్తూ
● జాతీయ పోటీలకు ఎంపిక
తమ ఆశయానికి కష్టాలు ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించారు బీవీనగర్‌కు చెందిన రమ్య, భార్గవి. తల్లిదండ్రులు రోజు వారీ కూలీలైనా.. ఆర్థిక కష్టాలను అధిగమించి ఖోఖోలో రాణిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. స్టేడియం వద్దకు ఉదయం, సాయంత్రం వేళ క్రమం తప్పకుండా వచ్చి సాధన చేశారు. జిల్లా, రాష్ట్ర, సీనియర్స్ జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను మెరుగుపర్చుకున్నారు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్నారు.
– నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)
Comments
Please login to add a commentAdd a comment