
25న పోలేరమ్మ జాతర తొలి చాటింపు
● మే 6, 7 తేదీల్లో జాతర
నాయుడుపేటటౌన్: నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతరకు సంబంధించిన తొలి చాటింపును ఈనెల 25న వేయనున్నట్లు దేవదాయ శాఖ ఈఓ రవికృష్ణ తెలిపారు. ఆ శాఖ అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు నానాబాల సుబ్బారావు, ఆకుల కుబేరు మణి, నల్లబోతుల రామారావు, రాగి శేషగిరి బుధవారం విన్నమాలలో ఉన్న ఆలయ పెదకాపు ఆర్వభూమి శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లి సంప్రదాయబద్ధంగా తాంబూలం అందజేశారు. అనంతరం జాతర వేడుకలకు శ్రీకారం చుట్టారు. 25న పోలేరమ్మ మొదటి చాటింపు వేసి జాతర వేడుకలను వేదపండితుల సూచనల మేరకు మే 6, 7, తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పెదకాపు శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా విన్నమాల గ్రామస్తులకు అమ్మవారి తాంబూలం అందజేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది యుగంధర్, నాయకులు దేవత కిశోర్‌శెట్టి, బిరదవాడ నారాయణ, మహేష్‌రెడ్డి, గుంటూరు లక్ష్మయ్య, మదిరి జలంధర్, చిట్టిబాబు, ఆలయ పూజారి రాయపూడి మునిసురేష్, విన్నమాల గ్రామపెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment