మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా
నెల్లూరురూరల్: ‘సార్ మేము ఇక్కడికి వస్తున్నాము.. మీరు మా అర్జీలను కింద స్థాయి అధికారులకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్తే సమాధానం కూడా చెప్పడంలేదు. మీ దగ్గరకు వస్తేనే మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్లాలి. కొంచెం మా పై దయచూపి పరిష్కారం అయ్యేలా చూడండి’ అంటూ బాధితులు కలెక్టరేట్ అధికారులను గద్గద స్వరంలో కన్నీటి పర్యంతమయ్యారు. నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. వినతులు పరిష్కరించాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు. జేసీ కె.కార్తీక్, డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు అర్జీలు స్వీకరించారు.
ఊటుకూరు దళితులకు భూములు
అప్పగించాలి
● ఎస్. మల్లి, న్యాయవాది,
దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు
విడవలూరు మండలం ఊటుకూరులో దళితుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని వారి భూములు వారికి అప్పగించాలని న్యాయవాది, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జేసీకి వినతిపత్రం అందజేశారు. ఎస్.మల్లి మాట్లాడుతూ 2018లో ఊటుకూరుకు చెందిన పలువురు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం ద్వారా సర్వే నంబరు 1288 నుంచి 1294 వరకు 90.26 ఎకరాలు కొని ఇచ్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదన్నారు. స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్ రెండో సారి కూడా అక్కడే పోస్టింగ్ వేయించుకుని భూములను దళితులకు దక్కనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 50 ఎకరాలు భూ కబ్జాదారులు ఆక్రమించుకుని పంటలు పండించుకుంటున్నారన్నారు. అద్దంకి కార్తీక్, పీ పాపయ్య మాట్లాడుతూ దాదాపు రూ.8 కోట్ల విలువైన భూములు 8 ఏళ్లుగా సాగుబడి చేసుకుని లబ్ధిపొందుతున్నారని తెలిపారు. తక్షణం జోక్యం చేసుకుని సర్వే చేసి, హద్దులు చూపించి సాగు చేపట్టేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జేసీ కార్తీక్ దళిత నేతలకు హామీ ఇచ్చారు. ఆత్మకూరు కొండయ్య, ఇమ్మానియల్, శివాజీ, జెడ్డా వాసు తదితరులు ఉన్నారు.
రాయితీలు త్వరగా ఇవ్వండి
అట్రాసిటీకి గురైన బాధితులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు త్వరగా ఇవ్వాలని రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహబూబ్ సోమవారం జేసీకికు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో అట్రాసిటీకి గురైన బాధితులకు ఇంత వరకు రాయితీలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బత్తల మధుసూదన్, అరికొండ సురేష్, నిమ్మల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించండి
కలెక్టరేట్‌కు 309 ప్రజావిజ్ఞప్తులు
ప్రతి వారం వందల సంఖ్యలో అర్జీలు
పరిష్కారం కావడం లేదని
కన్నీటి పర్యంతరం
– జేసీ కార్తీక్
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం 309 అర్జీలు ప్రజల నుంచి వచ్చాయి. ఇందులో అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 138, మున్సిపల్ శాఖవి 33, సర్వేకు 30, పంచాయతీరాజ్ శాఖ 21, స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 9 అర్జీలు అందాయన్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ అధికారులను ఆదేశించారు.
నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమణలు
కొత్తూరు బిట్–2 సర్వే నంబరు 21, 73, 21, 74లో కండలేరు జలాశయం ముంపు బాధితుల పునరావాస ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కె కాంతారావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికుడు వి.రమేష్‌రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 2021లో 150 మందికి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ప్రతి 20 కుటుంబాలకు తాగునీటికి ఒక బావి నిర్మించిందన్నారు. కొందరు ఆ బావులను ధ్వంసం చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా మారాయని డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నామన్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా తమ కేడర్ తెలియక, కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు లేక ఆరోగ్య మిత్రులు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీసు అసోసియేట్లు తదితరులు ఇబ్బంది పడుతున్నామన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎలాంటి బెనిఫిట్లు రావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవన్నారు. ప్రభుత్వ సైట్లలో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండడం వల్ల సంక్షేమ పథకాలు రావడం లేదన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులకు వినితిపత్రం అందజేశారు.
పొలం ఆక్రమించారు
నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరులో తనకు రావాల్సిన పొలాన్ని తన మరిది చిరంజీవి ఆక్రమించుకున్నాడని తాడిపర్తి రజనిమ్మ అనే మహిళ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జేసీకి వినతిపత్రం అందజేసింది. తన భర్త చనిపోయిన తర్వాత తన పేరుతో ఉన్న పట్టా భూమిని తనకు తెలియకుండానే వీఆర్‌ఓతో కలిసి అతని పేరు మీదకు 1బీ, అడంగళ్‌లో ఎక్కించుకున్నారని వాపోయారు. నా కూతురు చదువుకునే స్కూల్ దగ్గరకు వెళ్లి బెదిరిస్తున్నాడని తెలిపారు. నాకు ఏమైనా జరిగితే అతనిదే బాధ్యత అని కన్నీటి పర్యంతయ్యారు.
మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా
మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా
మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా


