మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 563 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 603 బేళ్లు రాగా 563 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.274.20గా నమోదైంది. వేలంలో 75,196 కిలోల పొగాకును విక్రయించగా రూ.20618965.20 వ్యాపారం జరిగింది. వేలంలో 9 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్‌పై వీఎస్‌యూ
అధికారుల విచారణ
కావలి: పట్టణంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేంద్రంలో పనిచేస్తున్న సహాయ ప్రొఫెసర్ పి.గోపికృష్ణపై తీరుపై వీఎస్‌యూ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పీజీ సెంటర్‌లో మహిళా అధ్యాపకులు, విద్యార్థినులను గోపీకృష్ణ అనేక రకాలుగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఐదుగురు సభ్యులతో కూడిన వర్సిటీ అధికారులు విచారణ చేశారు. విద్యార్థులు, మహిళ అధ్యాపకులు, విద్యార్థినుల విచారించి వీడియో రికార్డు చేశారు.
చివరి దశకు ఇంటర్
పరీక్షల మూల్యాంకనం
నెల్లూరు (టౌన్): ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి బాటని, జువాలజీ, కామర్స్ సబ్జెక్ట్‌ల ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభించినట్లు ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం నిర్వహించే అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ తెలుగు, హిందీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌ల మూ ల్యాంకనం పూర్తనట్లు చెప్పారు. మిగిలిన సబ్జెక్ట్‌లకు సంబంధించి మూల్యాంకనాన్ని వచ్చే నెల తొలి వారంలో పూర్తి కానున్నట్లు పేర్కొన్నారు. మూల్యాంకనంలో 1200 మందికి పైగా అధ్యాపకులు పాల్గొన్నట్లు తెలిపారు.
వెబ్ ఆప్షన్లు నమోదు
చేసుకోవాలి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫేజ్–2కు ఎంపికై న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాధాన్యత క్రమం వెబ్ ఆప్షన్స్ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖాధికారిణి కె.శోభారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థుల వివరాలు https:// mdfc. apcfss. in, https:// jnanabhumi. ap. gov. in వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 28వ తేదీ చివరి గడువని తెలిపారు. ఇతర వివరాలకు 95816 30003 నంబరులో సంప్రదించాలని సూచించారు.