● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
కోవూరు: నియోజకవర్గంలో పార్టీ నేతలందరూ సమన్వయంతో ముందుకు సాగి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. మండలంలోని పడుగుపాడు సొసైటీ మాజీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి నివాసంలో శుక్రవారం పార్టీ నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతి ఒక్కరూ అందరిని కలుపుకుని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా పని చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకు స్థానికంగా ఉండే మీరు భరోసా కల్పించాలన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా, ఇబ్బంది కలిగినా కమిటీ సభ్యులందరూ వెళ్లి అండగా నిలవాలన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు జరిగాయని, అలాంటివి ఇక మీదట జరగవన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా తాను ఇకపై జాగ్రత్తలు తీసుకొంటానన్నారు.
కమిటీ సభ్యుల నియామకం
అత్తిపల్లి అనుప్‌రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కవరగిరి శ్రీలత, శివుని నరసింహరెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, షేక్ జుబేర్, తాటిపర్తి విజయకుమార్ రెడ్డి, నీలపరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి, భీమతాటి శ్రీధర్, యరటపల్లి మీరారెడ్డి, జెట్టి శ్యాంసుందర్‌రెడ్డి, కాటంరెడ్డి దినేష్‌రెడ్డిలను ఏకగ్రీవ తీర్మానంతో ప్రసన్నకుమార్‌రెడ్డి నియమించారు.