వైఎస్సార్‌సీపీ పీఏసీలో అనిల్, ప్రసన్నలకు చోటు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తిగా వ్యవస్థీకరించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు చోటు లభించింది. వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్, కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలను పీఏసీలో నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఽశనివారం ఆదేశాలు జారీ చేసింది.
మద్యానికి బానిసలవ్వొద్దు
● డీపీఈఓ శ్రీనివాసులునాయుడు
నెల్లూరు(క్రైమ్): మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) ఎ.శ్రీనివాసులనాయుడు ప్రజలకు సూచించారు. శనివారం నగరంలోని కొండాయపాళెం గేటు వద్ద భవన కార్మికులకు ఎకై ్సజ్ అధికారులు మద్యానికి బానిలవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ మద్యానికి బానిసలైన వారు ఎవ్వరైనా ఉంటే తమకు తెలియజేయాలని, వారిని డీ అడిక్షన్ కేంద్రాల్లో చేర్పిస్తామని సూచించారు. అనంతరం కొండాయపాలెం గేటు నుంచి బొల్లినేని ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, కోవూరు, ఇందుకూరుపేట సీఐలు వై.వెంకటేశ్వర్లు, పి.అనిత, ఐ.శీనుబాబు, ఎస్‌ఐలు ఎస్.ప్రభాకర్‌రావు, డి.శ్రీధర్, జీకేవీఎన్ మురళీకృష్ణ, సీహెచ్ పూర్ణకుమార్, కె.హరిబాబు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
రాత్రివేళల్లో భీకర అరుపులు
దుత్తలూరు: గ్రామ సమీపాన గల అటవీ ప్రాంతం నుంచి అర్ధరాత్రి తరువాత భీకర అరుపులు వస్తున్నాయి. దాంతో బయటకు రావాలంటే భయమేస్తోందని కొత్తపేట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామ సమీపంలో వాగు వద్ద చిరుతపులి సంచరించడాన్ని గ్రామస్తుడు గుర్తించిన విషయం విదితమే. శనివారం డీఆర్వో మురళి, ఎఫ్‌బీఓ ప్రసాద్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాత్రి సమయంలో భీకర అరుపులు వినిపిస్తున్నాయని, ఆ అరుపులతో కుక్కలు సైతం మొరుగుతున్నాయని అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు వాగు ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ అడవిపందులు సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించారు. ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు.
మాలకొండ మాల్యాద్రికి
రూ.14.07 లక్షల ఆదాయం
వలేటివారిపాలెం: మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామికి శనివారం ఒక్క రోజు ఆదాయం రూ.14.07 లక్షలు వచ్చినట్లు ఉప కమిషనర్ కేవీ సాగర్‌బాబు తెలిపారు. అష్టోత్తరం ద్వారా రూ.8,650, కుంకుమార్చన రూ.21,240, వివాహాలు రూ.14,000, తలనీలాలు రూ.42,925, వాహన పూజలు రూ.3,440, ప్రత్యేక దర్శనం రూ.3,31,800, రూము అద్దెలు రూ.33,410, కవర్లు రూ.8,400, లడ్డూ ప్రసాదాలు 2,47,080, అన్నదానం రూ.2,80,658, విరాళాలు రూ.4,15,000, స్థల పురాణం ద్వారా రూ.1,000 ఆదాయం వచ్చినట్లు వివరించారు.
పరీక్ష ఫెయిలై
విద్యార్థి బలవన్మరణం
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌లోని ఓ కుటుంబం చింతారెడ్డిపాళెంలో నివాసం ఉంటోంది. వారి కుమారుడు రామలింగాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. శనివారం ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆ విద్యార్థి ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ పీఏసీలో అనిల్, ప్రసన్నలకు చోటు
వైఎస్సార్‌సీపీ పీఏసీలో అనిల్, ప్రసన్నలకు చోటు
వైఎస్సార్‌సీపీ పీఏసీలో అనిల్, ప్రసన్నలకు చోటు


