
సంగంలో వైభవంగా సంగమేశ్వరుడి రథోత్సవం
సంగం: సంగంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సంగమేశ్వరస్వామి రథోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి రథం మీద కొలువుతీర్చారు. అనంతరం గ్రామ పురవీధుల్లో భక్తుల హరహర మహాదేవ నామస్మరణ మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆత్మకూరు సీఐ గంగాధర్, సంగం, ఏఎస్‌పేట, చేజర్ల ఎస్సైలు దగ్గరుండి పర్యవేక్షించారు. రథోత్సవానికి కోటు దయాకర్‌రెడ్డి, కోటు కరుణాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.