చెట్లు ఉండడంతో హద్దులు చూపించలేదు
ఎల్‌పీ స్కీమ్‌లో ఇచ్చిన భూముల్లో కంప చెట్లు ఉండడంతో వాటికి హద్దులు చూపించలేకపోతున్నాం. ఆ భూముల్లో ఉన్న చెట్లు తొలగించుకుని వస్తే అప్పుడు సర్వే చేసి హద్దులు చూపిస్తాం.
– పీ చంద్రశేఖర్, తహసీల్దార్
విడవలూరు
హద్దులు చూపించకుంటే ఎలా
2018లో మాకు ఒక్క ఎకరా చొప్పున ప్రభుత్వం మొత్తం 91 ఎకరాల విస్తీర్ణంలో పొలాన్ని ఇచ్చారు. అయితే 91 ఎకరాలకు నాలుగు వైపులా హద్దు రాళ్లను ఏర్పాటు చేయకుండా జంగిల్ క్లియరెన్స్ చేసుకోమంటే ఎలా చేసుకోవాలి.
– చనుమూరి సరోజనమ్మ
పొలం చూపించలేదు..
లోన్ కట్టాలంట!
మాకు మంజూరైన పొలం 8 ఏళ్లుగా ఎక్కడ ఉందో ఇంత వరకు తెలియదు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడేమో లోన్ కట్టాలంటూ మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నోటీసులు వచ్చాయి. అసలు మా పొలం ఎక్కడుందో మాకు తెలియదంటే లోను కట్టాలంటూ నోటీసులు పంపడం హాస్యాస్పందంగా ఉంది. – కర్లగుంట శీనమ్మ
●
చెట్లు ఉండడంతో హద్దులు చూపించలేదు
చెట్లు ఉండడంతో హద్దులు చూపించలేదు
Comments
Please login to add a commentAdd a comment