వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో షుగర్ ఫ్యాక్టరీపై ఆశలు చిగురించాయి. అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రాధాన్యతను, రైతులు, ఉద్యోగుల బకాయిల విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. దీంతో ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నాహాలు చేశారు. అందులో భాగంగా ఫ్యాక్టరీ స్థితిగతులు తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఫ్యాక్టరీలోని యంత్రాలను పరిశీలించింది. 2013 నుంచి ఫ్యాక్టరీ మూతపడిపోవడంతో యంత్రాలు వినియోగపడవని నిర్ధారించింది. ఫ్యాక్టరీ పునః ప్రారంభించడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని కమిటీ స్పష్టం చేసింది.