
నిధులు అధికంగా కేటాయించాలి
ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆరోగ్యం కోసం అధికంగా ఖర్చు చేసి ఆస్తులను అమ్ముకున్న పేద, మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి అధికంగా నిధులు కేటాయించాలి. స్పెషలైజేషన్ వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయిలో అందించాలి. పేదలకు పౌష్టికాహారం అందేలా చూడాలి. ప్రజారోగ్యంపై ప్రజలను చైతన్యం చేయాలి.
– డాక్టర్ ఎంవీ రమణయ్య,
ప్రజారోగ్య వేదిక రాష్ట్రాధ్యక్షుడు, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల
●