
పీఎంజేఏవై కార్డులతో ఉచిత వైద్యం
నెల్లూరు(అర్బన్): 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీం (పీఎంజేఏవై), ఎన్టీఆర్ వైద్యసేవ సంయుక్త కార్యక్రమం ద్వారా సంవత్సరానికి రూ.5 లక్షల ఉచిత వైద్యం అందుతుందని ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లా మేనేజర్ వెంకట మురళితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కార్డు పొందేందుకు ఆదాయంతో పని లేదన్నారు. దేశంలో ఎక్కడైనా నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం పొందవచ్చన్నారు. కార్డులను పొందేందుకు క్షేత్రస్థాయిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ఈకేవైసీ చేస్తున్నారన్నారు. ప్రజలు సహకరించి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. డబ్లూడబ్లూడబ్లూ.పీఎంజేఏవై, జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ పథకంలో పేర్ల నమోదులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఈ స్కీంలోకి రారన్నారు.
70 ఏళ్లు నిండిన వారు కార్డులు
తీసుకోవాలి
ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్
సుధీర్‌కుమార్