
యాదవ ఎంప్లాయీస్ సొసైటీ భవన ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): మినీబైపాస్‌లోని పూలే సెంటర్ వద్ద యాదవ ఎంప్లాయీస్ సొసైటీ నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా ఏపీ స్టేట్ గెజిటెడ్ జేఏసీ అధ్యక్షుడు కృష్ణయ్య, అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్‌బాబు, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ హాజరయ్యారు. అనంతరం కృష్ణసాయి కన్వెన్షన్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, దయాకర్, గురుప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రవీణ్‌కుమార్, వినయ్, సురేష్‌బాబు, బలరామ్, శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులుగా మురళి, సుకుమార్, జగదీష్, కొండయ్య, గురవయ్య, కార్యాలయ ఇన్‌చార్జిలుగా కేశవకుమార్, జయరామయ్య, లోకేశ్ తదితరులను ఎన్నుకున్నారు.
వెంకన్నపాళెం
తీరంలో షిప్ పరికరం
తోటపల్లిగూడూరు: మండలంలోని వెంకన్నపాళెం సముద్ర తీరానికి గురువారం రాత్రి షిప్ పరికరం కొట్టుకొచ్చింది. దీనిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు జేసీబీతో ఒడ్డుకు చేర్చారు. భారీ స్థాయిలో ఉన్న దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. సమాచారం అందుకున్న మైరెన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అది షిప్‌కు ఇంధనం ఎక్కించే ఆయిల్ ట్యాంకర్‌గా వారు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా మైరెన్ పోలీసులు మాట్లాడుతూ రాకెట్ శకలమంటూ పుకార్లు వచ్చాయని, అందులో వాస్తవం లేదన్నారు. ఉన్నతాధికారుల సూచనలతో దానిని జిల్లా కేంద్రానికి తరలిస్తామన్నారు.
పాతకక్షలతో వ్యక్తిపై దాడి
పొదలకూరు: పట్టణానికి సమీపంలోని లింగంపల్లి తోపులో ఓ వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన వారు పాతకక్షలను మనసులో పెట్టుకుని కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలు.. గురువారం రాత్రి పిల్లిపోగు పెంచలయ్య భోజనం చేసి ఇంటి బయట తిరుగుతుండగా చిన్నా, సంపూర్ణ దంపతులు పథకం ప్రకారం కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. అల్యూమినియం బీడింగ్‌తో తలపై కొట్టడంతో పెంచలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్‌కే హనీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
అల్లూరు: మండలంలోని అల్లూరుపేట సత్రంలో ఉన్న గంగమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల ఉత్సవం సందర్భంగా పీజీఎం యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలను శుక్రవారం అల్లూరులో నిర్వహించారు. కోవూరుకు చెందిన శ్రీచెన్నకేశవ స్వామి ఎడ్లు మొదటి బహుమతి, పొట్టేపాళెం గ్రామానికి చెందిన వరసిద్ధి వినాయక స్వామి ఎడ్లు రెండో బహుమతి, కోవూరుకు చెందిన కర్లగుంట ప్రభాకర్ ఎడ్లు మూడో బహుమతి, పాటూరు గ్రామానికి చెందిన ఎడ్లు నాలుగో బహుమతి, యల్లాయపాళెం గ్రామానికి చెందిన ఎడ్లు ఐదో బహుమతిని గెలుచుకున్నాయి. ప్రథమ బహుమతి రూ.25,116లను చిల్లంకూరు చంద్రశేఖరరెడ్డి, ద్వితీయ బహుమతి రూ.20,116లను కడివేటి హజరత్‌రెడ్డి, మూడో బహుమతి రూ.15,116లను వేగూరు అన్వేష్, నాలుగో బహుమతి రూ.10116లను అళహరి రామారావు, ఐదో బహుమతి రూ.7,116లను గుండాల గోపాలయ్య అందజేశారు. కార్యక్రమంలో అల్లూరుపేట సత్రం ఎడ్ల బండ్ల కమిటీ సభ్యులు, పీజీఎం యూత్ సభ్యులు పాల్గొన్నారు.

యాదవ ఎంప్లాయీస్ సొసైటీ భవన ప్రారంభం

యాదవ ఎంప్లాయీస్ సొసైటీ భవన ప్రారంభం

యాదవ ఎంప్లాయీస్ సొసైటీ భవన ప్రారంభం