మంత్రి చెప్పినా.. కేసులు కట్టించి.. | - | Sakshi
Sakshi News home page

మంత్రి చెప్పినా.. కేసులు కట్టించి..

Published Sat, Apr 26 2025 12:17 AM | Last Updated on Sat, Apr 26 2025 12:17 AM

మంత్రి చెప్పినా.. కేసులు కట్టించి..

మంత్రి చెప్పినా.. కేసులు కట్టించి..

కాకర్ల

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ‘ఆనం’కే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ఝలక్‌ ఇచ్చారు. ఎవరైతే నాకేంటి.. నా నియోజకవర్గానికి నేనే

ఎమ్మెల్యేను, నేనే మంత్రి..ఎవరి మాట వినాల్సిన అవసరం లేదన్నట్లుగా

వ్యవహరించడంతో విభేదాలకు కుంపటి రాజేసినట్లు అయ్యింది. వింజమూరు మండలం నల్లగొండ్లలో అక్రమ గ్రావెల్‌ తరలింపు రవాణా వ్యవహారం ఎమ్మెల్యే, మంత్రికి మధ్య అగాధాన్ని సృష్టించింది.

నల్లగొండ్ల గ్రావెల్‌ రవాణాదారుడు ఆనం అనుచరుడు

కేసులు పెట్టొద్దని ఎమ్మెల్యేకు చెప్పినా బేఖాతరు

అయినా నమోదు చేయించిన వైనం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఉదయగిరి నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో పతాక స్థాయికి చేరింది. మట్టి, గ్రావెల్‌, క్వార్ట్‌ ్జ, ఇసుక ఏదైనా సరే ఆయనకు కప్పం కట్టందే.. ట్రక్కు కూడా కదలని పరిస్థితి. తన వాటా చెల్లించకపోతే.. మనోడైనా.. పగోడైనా ఎవడైతే నాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లాకు చెందిన ఓ మంత్రి ముఖ్య అనుచరుడికే చుక్కలు చూపించాడు. గ్రావెల్‌, రఫ్‌ స్టోన్‌ రవాణా చేస్తున్న సదరు కాంట్రాక్టర్‌ వాహనాలను పోలీసుల ద్వారా నిలువరించారు. ఈ విషయంలో సదరు మంత్రి స్వయంగా ఫోన్‌ చేసి ఎమ్మెల్యేకి చెప్పినా వినిపించుకోలేదు.

మంత్రి అండతో భారీగా తరలింపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల ఆగడాలకు అంతేలేదు. ఇష్టానుసారంగా పేట్రేగిపోతున్నారు. అందిన మేరకు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి ముఖ్య అనుచరుడైన కాంట్రాక్టర్‌ అత్మకూరు నియోజవర్గంలో రూ.9 కోట్లతో రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ను పొందాడు. ఈ రోడ్డు నిర్మాణానికి గ్రావెల్‌, రఫ్‌ స్టోన్‌ అవసరం కావడంతో సదరు కాంట్రాక్టర్‌ కన్ను వింజమూరు మండలం నల్లగొండ్ల సర్వే నంబరు 36 (పాత నంబరు) ఎల్‌పీఎం 2169లో 67.36 ఎకరాల ప్రభుత్వ భూమి మీద పడింది. ఇందులో నాణ్యమైన గ్రావెల్‌తోపాటు, రఫ్‌ స్టోన్‌ కూడా లభిస్తోంది. ప్రత్యేకంగా మెటల్‌ (కంకర) కొనుగోలు చేయకుండానే ఇక్కడి మెటల్‌ ఉపయోగపడుతుందని, దగ్గరగా ఉంటుందని సదరు కాంట్రాక్టర్‌ సంతోష పడ్డాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పుకుండా కొన్ని నెలల నుంచి అప్పనంగా దోచేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎమ్మెల్యే ఆగమేఘాల మీద క్వారీల వద్దకు వెళ్లి తవ్వకాలను నిలిపివేసి, వాహనాలను అధికారులకు అప్పుగించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కేసు నిలకడపై సందిగ్ధత

ఈ కేసులో ఒక వైపు మంత్రి, మరో వైపు ఎమ్మెల్యే ఉండడంతో కేసు దర్యాప్తు సజావుగా సాగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఓ మాజీ మంత్రిపై అక్రమ గ్రావెల్‌ తరలింపు కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. స్వయంగా కూటమి ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్‌ రవాణా వాహనాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీని వెనుక ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్‌ చేసి కోర్టుకు పెట్టాలి. కానీ అలా జరగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్యే X మంత్రి

మైనింగ్‌ అధికారులవి కాకి లెక్కలేనా!

అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న వ్యక్తి మంత్రి అనుచరుడు కావడం, ఎమ్మెల్యే సదరు వ్యక్తిపై సీరియస్‌గా ఉండడంతో మంత్రి కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి మైనింగ్‌ అధికారులకు ఫోన్‌ చేసి కాస్త అనుకూలంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా మైనింగ్‌ అధికారి తాను రాకుండా తన కార్యాలయ సిబ్బందిని పంపించారు. భారీ స్థాయిలో గ్రావెల్‌, రఫ్‌ స్టోన్‌ తరలించి ఉన్నా, కేవలం 3500 క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తవ్వకాలు జరిపినట్లు లెక్కలు తేల్చారు.

ఈ వ్యవహరంపై సదరు కాంట్రాక్టర్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనే స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి కాంట్రాక్టర్‌ మనోడే వదిలేయాలని చెప్పడంతోపాటు మన పార్టీ నాయకుడిపైనే కేసులు పెడుతావా అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్‌ ఇల్లీగల్‌ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడం లేదు కదా! అంటూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో వింజమూరు తహసీల్దార్‌ ఇచ్చిన రిపోర్టు మేరకు స్థానిక ఎస్సై తొమ్మిది వాహనాల యజమానులు, గ్రావెల్‌ తోలిస్తున్న వ్యక్తి, వాహనాల నడుపుతున్న డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. ఈ వాహనాలు ప్రస్తుతం పోలీసుల ఆదుపులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement