మంచి అలవాట్లే శ్రీరామరక్ష
మంచి ఆహారపు అలవాట్లే శ్రీరామరక్ష. జంక్ ఫుడ్ మానేయాలి. ఇంట్లోనే తాజాగా ఆహార పదార్థాలను తయారు చేసుకుని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు లాంటివి తీసుకుంటే మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం అవసరం. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. బీపీ, షుగర్ ఉండే వారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.
– డాక్టర్ గంగాధర్, అసోసియేట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ పెద్దాస్పత్రి, నెల్లూరు


